Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి అరెస్ట్... స్పీకర్ కి తమిళనాడు ఎంపీ లేఖ

రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ని అరెస్టు చేశారని స్పీకర్ కి ఆమె లేఖలో స్పష్టంగా తెలియజేశారు. అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ప్రభుత్వం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుల చేయాలని కోరారు.

Tamilnadu MP Jothimani Letter To Speaker Om Birla Over Revanth Reddy Arrest
Author
Hyderabad, First Published Mar 13, 2020, 3:02 PM IST

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె స్పీకర్ కి లేఖ కూడా రాశారు. డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారన్న విషయాన్ని ఆమె లేఖ లో ప్రస్తావించారు.

Also Read కాంగ్రెస్ పార్టీ అసలుకే ఎసరు.. మరో సింధియాగా రేవంత్ రెడ్డి..?

రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ని అరెస్టు చేశారని స్పీకర్ కి ఆమె లేఖలో స్పష్టంగా తెలియజేశారు. అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానం కోరిన ఆమె.. రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా ప్రభుత్వం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే రేవంత్ రెడ్డిని విడుల చేయాలని కోరారు.

ఈ లేఖ మీడియాలో సంచలనం రేపింది. దీంతో.. ఎవరీ ఎంపీ జోతిమణి అనే విషయంపై అందరి దృష్టి పడింది. తమిళనాడులోని కరూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జోతిమణి.. చురుకైన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ యూత్ లీడర్ స్థాయి నుంచి ఎంపీగా ఎదిగారు. తమిళ, మలయాళం భాషలతో పాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుచర గణంలో ఆమె ఒకరు. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios