తమిళనాడు: తమిళనాడు రాష్ట్రప్రభుత్వం మధురైకి చెందిన భార్య భర్తల మధ్య చిచ్చుపెట్టింది. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు హోల్డర్లకు  పండుగ బోనస్ ప్రకటించింది. 

ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ఇవ్వాలని మధురైకు చెందిన రామర్ తన భార్య రాజాతీని అడిగాడు. బోనస్ ఇచ్చేందుకు రాజాతీ అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన రామర్ భార్యన హత్య చేశాడు. 

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షణికావేశంలో తన భార్యను చంపినట్లు నిందితుడు రామర్ స్పష్టం పోలీసులకు చెప్పాడు.