చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని  తిరుచ్చి జిల్లా నడుకట్టుపట్టి గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో రెండున్నర ఏళ్ల బాలుడు 25 పీట్ల లోతు బోరు బావిలో పడిపోయాడు. ఈ బాలుడిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.

సుజిత్ విల్సన్ అనే బాలుడు ఆడుకొంటూ వెళ్లి  తన ఇంటికి సమీపంలోని బోరు బావిలో పడిపోయాడు.ఈ విషయం తెలిసిన వెంటనే బోరు బావి నుండి బాలుడిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సుజిత్ విల్సన్ ను రక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని తమిళనాడు ప్రభుత్వం పంపింది.

ఈ బోర్ కు పక్కనే సమాంతరంగా మరో పెద్ద గొయ్యిని కూడ తవ్వుతున్నారు. బోరు బావిలోకి సొరంగం తవ్వి బాలుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.అయితే 10 అడుగుల లోతు గొయ్యి తవ్విన తర్వాత రాళ్లు అడ్డుగా వచ్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు ప్రకటించారు.ఈ రాళ్లను తొలగిస్తూ సొరంగం తవ్వుతున్నారు.

బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ ను వెలికి తీసేందుకు గాను తిరుచ్ఛిపల్లి, కోయంబత్తూరు, మధురై నుండి నిపుణుల బృందం వచ్చింది.పసిబాలుడి నడుము చుట్టూ తాడును బిగించి  బోరు బావి నుండి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు దఫాలు ఈ రకంగా చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. 

సుజిత్ ను బోరు బావి నుండి వెలికితీసేందుకు గాను బోరు బావి పక్కనే సమాంతరంగా మరో సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ విల్సన్  బోరు బావిలో మరింత కిందకు జారిపోయినట్టుగా  తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

తొలుత 27 అడుగుల లోతులో ఉన్న సుజిత్ విల్సన్ ఆ తర్వాత 70 అడుగుల  లోతులోకి కూరుకుపోయినట్టుగా మంత్రి  విజయభాస్కర్ చెప్పారు.బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ ను బయటకు తీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్, ఎన్‌ఎల్‌సీ సిబ్బంది బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

బోరు బావిలో పడిపోయిన బాలుడిని సజీవంగా ఉంచేందుకు ఆక్సిజన్ ను నిరంతరరాయంగా సరఫరా చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.శనివారం నాడు ఉదయం నుండి ఆ బాలుడి శబ్దాలు తాము వినలేదని రెస్క్యూ సిబ్బంది ప్రకటించారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

బోరు బావిలోనే బాలుడు ఇంకా ఉండడంతో చిన్నారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి సుజిత్ ను  త్వరగా బోరు బావి నుంండి వెలికి తీయాలని కోరుతున్నారు.