పాఠశాలను దేవాలయంతో పోలుస్తారు. అలాంటి పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు నీచపు పనులు చేశాడు. స్కూల్ టాయ్ లెట్స్ లో ఆ పాఠశాలలో పనిచేసే ఉద్యోగితో రాసలీలు నిర్వహించాడు. దీంతో... ఆ ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేసి బుద్ధి చెప్పారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా బుధన్ సంత సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... నామక్కల్‌ జిల్లా బుధన్‌ సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణ్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. అతనికి కొంత కాలం క్రితం పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆర్గనైజర్ జయంతికి, టీచర్ శరవణన్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

వారు మంగళవారం ఉదయం పాఠశాల ప్రాంగణంలోని మరుగుదొడ్లో రాసలీలకు పాల్పడుతుండడాన్ని చూసిన విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు అక్కడికి చేరుకుని శరవణన్‌ను చితకబాది అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు త్వరలో విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది.