లక్నో: భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణంగా తన భార్య తలను నరికి హత్య చేశాడు. అంతేకాదు ఆమె నరికిన ఆమె తలను తీసుకొని పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బందా ప్రాంతానికి చెందిన చిన్నార్ యాదవ్, విమలా దంపతులు నేతా నగర్ లో నివాసం ఉంటున్నారు. భార్యతో ఆయన శుక్రవారం నాడు ఉదయం గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. దీంతో ఆగ్రహం పట్టలేక చిన్నార్ యాదవ్ ఇంట్లోని కత్తిని తీసుకొని తన భార్యపై కత్తితో దాడికి దిగాడు.

భార్య తలను కత్తితో వేరు చేశాడు.  తన భార్య తలను పట్టుకొని ఆయన నేరుగా బబేర్ పోలీస్ స్టేషన్ ను చేరుకొని లొంగిపోయాడు.భార్య తలను పట్టుకొని ఆయన పోలీస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో కొందరు ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోలీసులు యాదవ్ ను అరెస్ట్ చేశారు. భార్యను హత్య చేసేందుకు ఆయన ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గత ఏడాది  ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాలో ఇదే తరహాలో ఓ ఘటన చోటు చేసుకొంది. భార్య తలను నరికిన భర్త... ఆమె తలను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు.