Asianet News TeluguAsianet News Telugu

Threat calls: ఢిల్లీలో కాశ్మీర్ జెండాను ఎగుర‌వేస్తాం.. సుప్రీంకోర్టు అడ్వొకేట్లకు బెదిరింపు కాల్స్

Threat calls: కాశ్మీరీయుల‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని తొలగించడంపై తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ ఉగ్ర సంస్థ వ‌రుస‌గా.. సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఫోన్లు చేస్తూ  బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంది.
 

Supreme Court Lawyers Receive Threat Calls Again, This Time Over Kashmir
Author
Hyderabad, First Published Jan 24, 2022, 2:31 PM IST

Threat calls: కాశ్మీరీయుల‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ని తొలగించడంపై తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ ఉగ్ర సంస్థ వ‌రుస‌గా.. సుప్రీంకోర్టు న్యాయవాదులకు ఫోన్లు చేస్తూ  బెదిరింపుల‌కు పాల్ప‌డుతోంది. తాజాగా మ‌రోసారి ఈ ఉగ్ర సంస్థ నుంచి బెదిరింపు కాల్స్ వ‌చ్చామ‌ని ప‌లువురు సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆరోపిస్తోన్నారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో కాశ్మీర్ జెండాను ఎగురవేస్తామని బెదిరించారని, ఆర్టిక‌ల్ 370 ని మ‌ళ్లీ పున‌ర్దించాల‌ని డిమాండ్ చేశారని , పంజాబ్​లో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీ విచారణ సాగనివ్వబోమని బెదిరించార‌ని తెలిపారు. నెల రోజుల్లో బెదిరింపు కాల్స్‌ రావడం ఇది మూడోసారి.

 ఖలిస్థాన్ అనుకూల ఉగ్ర సంస్థ ..   త‌మ పోరాటాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం.. ఆర్టికల్ 370ని తొలగించిన విధానం కాశ్మీర్ ప్రజల హక్కులకు విరుద్ధమని, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో సుప్రీంకోర్టు కూడా అంతే బాధ్యత వహిస్తుందని హెచ్చ‌రించారని తెలిపారు. కాశ్మీర్ స్వాతంత్య్ర పోరాటం జరుగుతుంది. ఈ పోరాటం ఢిల్లీతో పాటు యావ‌త్తు ప్రపంచం చూస్తుందని,  ఖలిస్తాన్ ఆలోచనకు మద్దతు ఇచ్చే సంస్థ 'సిక్కులు ఫర్ జస్టిస్' కూడా ఢిల్లీకి పోరాటాన్ని తీసుకువెళుతోంది" అని కాల్ రికార్డింగ్ ట్రాన్స్క్రిప్ట్ పేర్కొంది.

గ‌తం వారం  సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్ జే)  అనే ఉగ్ర వాద సంస్థ కూడా బెదిరింపుల‌కు పాల్ప‌డింది.  
రిపబ్లిక్ డే నాడు ప్రధానిమోడీ ఢిల్లీలో జెండా ఎగరవేయకుండా అడ్డుకుంటామని ఖలిస్తానీ మూమెంట్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్ జే) హెచ్చరించింది. 

అలాగే.. పంజాబ్​లో ప్రధాని పర్యటన  జరిగిన భద్రతా పై జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీ విచారణ సాగనివ్వబోమని చెప్పింది. పలువురు సుప్రీంకోర్టు అడ్వొకేట్లకు ఈమేరకు ఎస్ఎఫ్​జే నుంచి రెండోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొదటిసారి బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత అడ్వొకేట్ దీపక్ ప్రకాశ్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అంతకుముందు, పంజాబ్‌లోని ఫ్లైఓవర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ 20 నిమిషాల పాటు నిలిచిపోవ‌డానికి గ‌ల  భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు విచారణ కమిటీలోని న్యాయమూర్తులను బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఖలిస్థాన్ అనుకూల గ్రూప్ సిక్కులు ఫర్ జస్టిస్ నుండి - ఇదే విషయంపై బెదిరింపులు వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios