Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక: ప్రభుత్వ భూముల డీనోటిఫికేషన్.. విచారణకు కోర్ట్ ఆదేశం, చిక్కుల్లో యడియూరప్ప

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భూమి అప్పగింతపై యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్ట్ తిరస్కరించింది. భూముల డీనోటిఫికేషన్‌పై పునర్విచారణకు కోర్ట్ ఆదేశించింది. 

special court rejects closure of investigation by lokayukta police against karnataka cm yediyurappa ksp
Author
Bangalore, First Published Jul 3, 2021, 6:25 PM IST

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భూమి అప్పగింతపై యడ్యూరప్పపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూముల డీనోటిఫికేషన్ కేసులో పోలీసుల నివేదికను బెంగళూరు స్పెషల్ కోర్ట్ తిరస్కరించింది. భూముల డీనోటిఫికేషన్‌పై పునర్విచారణకు కోర్ట్ ఆదేశించింది. 

Also Read:విందు రాజకీయం: యడ్డీకి పాతిక మంది ఎమ్మెల్యే షాక్, కుర్చీకీ ఎసరేనా..?

కాగా, దక్షిణాదిన బీజేపీకి గుండెకాయ వంటి కర్ణాటకలో బీజేపీ కష్టాలు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు నళిన్ నాయకత్వ మార్పు ఉండదని చెబుతున్నా, సీనియర్ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. సీఎం వ్యతిరేక వర్గానికి బీజేపీ జాతీయ ప్రదాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్ మద్దతిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు 17 శాతం గల లింగాయత్ వర్గానికి నాయకుడైన యడియ్యూరప్పను తొలగించడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ కొందరు హైకమాండ్ వద్ద ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లుగా స్పష్టమవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios