గుండె సంబంధిత సమస్యతలతో జీవితం మీద విరక్తి చెందిన ఓ టెకీ.. నైట్రోజన్ గ్యాస్ పీల్చుకుని కారులోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. 

బెంగుళూరు : ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన కారులోనే నైట్రోజన్ గ్యాస్‌ పీల్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. డిప్రెషన్‌ తట్టుకోలేక అతను తన జీవితాన్ని అలా ముగించుకున్న సంఘటన సోమవారం బెంగళూరులో జరిగింది. విజయ్ కుమార్ (52) అనే వ్యక్తి కారులో వెనుక సీటులో ప్లాస్టిక్ షీట్‌తో ముఖాన్ని కప్పుకుని.. పడుకుని చనిపోయాడు.

25 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్హార్ట్ ఆపరేషన్ తర్వాత డిప్రెషన్‌ తో బాధపడుతున్నారు. దీంతో సోమవారం పశ్చిమ బెంగుళూరులోని కురుబరహళ్లిలో రోడ్డు పక్కన తన కారులో నైట్రోజన్‌ గ్యాస్ ను పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన విజయ్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన విజయ్ కుమార్ సమీపంలోని కురుబరహళ్లిలోని పార్కుకు చేరుకున్నాడు. 

అక్కడ తన కారును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. ఆ తరువాత, తాను లోపల ఉండి కారుకు బైటినుంచి కవర్ వేయించాడు. దీనికోసం రోడ్‌సైడ్ చాట్ అమ్మే వ్యక్తి సహాయం తీసుకున్నాడు. దీనికి మొదట అతను అనుమానం వ్యక్తం చేయగా.. కారులో తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, అయితే కవర్ వేయకపోతే కారులో ఉన్న తనను చూసి పోలీసులు ఇబ్బంది పెడతారని అతడిని బతిమాలాడు. దీంతో అతను ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

మూడు పెళ్లిళ్లు, ముగ్గురు భార్యలు.. మరో మహిళతో ప్రేమ.. పెళ్లి చేసుకోమంటే హత్య చేసి.. పట్టిచ్చిన చెప్పులు...

అలా కారును పాక్షికంగా కవర్ అయ్యే విధంగా కారుపై కవర్‌ను వేయడంలో చాట్ విక్రేత సహాయం చేశాడు. అయితే, రోజూ అదే స్థలంలో తన కారును పార్క్ చేసే స్థానికురొకరు సాయంత్రం వచ్చి చూసేసరికి వేరే కారు కనిపించింది. దీంతో అది ఎవరి కారో అని చూడడానికి.. కారు మీద వేసిన కవర్ ను జరిపాడు. అయితే, అక్కడ వాహనంలో విషపూరిత వాయువు నిండినందున పోలీసులు మాత్రమే కారు తలుపులు తెరవాలని పేర్కొంటూ ఓ నోట్ ను కారు ముందు విండ్‌షీల్డ్‌పై చూశాడు. వెంటనే.. కారు మీద కప్పిన కవర్‌ను తీసేయగా, వెనుక సీటులో ప్లాస్టిక్‌ కవర్ తో ముఖం బంధించబడిన వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు.

మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డోర్లు తెరిచారు. కారులో 10 కిలోల నైట్రోజన్ సిలిండర్, దాని నుండి గ్యాస్‌ను వ్యక్తి ముఖానికి చుట్టిన ప్లాస్టిక్ కవర్‌లోకి సరఫరా చేస్తున్న పైపును కనుగొన్నారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఎంబీబీఎస్, కూతురు ఇంజినీరింగ్ చదువుతున్నారు. కుమార్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉన్నందున 2022 జనవరిలో హార్ట్ ఆపరేషన్ జరిగినట్లు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శస్త్ర చికిత్స తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆ విషయాన్ని కుటుంబసభ్యులతో చర్చించాడు. అంతేకాదు, అతను తన భార్య, పిల్లలతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లుగా.. నిరాశలో ఉన్నట్లుగా కూడా చెప్పాడని తేలింది. 

ఆత్మహత్య చేసుకోవడం ఎలా అని కుమార్ యూ ట్యూబ్ లో వీడియోలు కూడా చూసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మూసివున్న కారులో నైట్రోజన్‌ను పీల్చడం ద్వారా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా, గ్యాస్ సిలిండర్‌ను సేకరించి, వెనుక సీట్ల బూట్‌లెగ్ స్పేస్‌లో పెట్టాడు. ఈ మేరకు పోలీసులు అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకున్నారు. నైట్రోజన్ గ్యాస్ ను ఎలా సేకరించాడు లాంటి ఇతర వివరాలను పరిశీలిస్తున్నట్లు డీసీపీ (నార్త్) వినాయక్ పాటిల్ తెలిపారు.