Social Media Rules: సోషల్ మీడియా నిబంధనలను మరింత కఠినం చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు.
Social Media Rules: సోషల్ మీడియా నిబంధనలను మరింత కఠినం చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకు కేంద్రం సిద్ధంగా ఉందని శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం నేత జర్నా దాస్ బైద్యా ప్రశ్నిస్తూ ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లామ్‌ఫారాల కోసం ఏదైనా నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తున్నదా ? లేదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను జవాబుదారీగా చేయడానికి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకున్నప్పుడల్లా ప్రతిపక్షాలు వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నాయని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కానీ, సోషల్ మీడియాను మరింత జవాబుదారీగా మార్చాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉంటే కఠిన నిబంధనలు తీసుకురావచ్చని మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభలో అన్నారు.
ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న 'బుల్లిబాయి' వంటి వెబ్‌సైట్‌లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని బిజెపి మంత్రి సుశీల్ కుమార్ మోడీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఉల్లంఘనలు జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే చర్యలు తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. 'బుల్లి బాయి' వంటి వెబ్‌సైట్‌ల విషయం చాలా సున్నితమైందనీ, మహిళల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం. దానిపై ఎటువంటి రాజీ లేదనీ, ప్రభుత్వం నిబద్ధతతో ఉందనీ, అందులో ఏ మతం లేదా ప్రాంతం గురించి మాట్లాడలేదని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించిందని, కేవలం పైపైన చర్య తీసుకోలేదని, మూలకారణానికి వెళ్లి మరింత లోతుగా వెళ్లి విచారణ చేసిందని ఐటి మంత్రిత్వ శాఖ మంత్రి అన్నారు.
మహిళలు, మన భవిష్యత్ తరాల భద్రతను నిర్ధారించడానికి సోషల్ మీడియాను జవాబుదారీగా చేయడానికి .. సమతుల్యత, ఏకాభిప్రాయాన్ని రావాలని అన్నారు. ఇందుకోసం సోషల్ మీడియా నిబంధనలను పటిష్టం చేయాలని, వాక్ స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం కాలరాస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తే సరికాదన్నారు.
నూతన దిశలో కలిసి కదలాలి
సోషల్ మీడియా పనితీరును సమర్థవంతంగా తనిఖీ చేయడానికి ఏదైనా ధృవీకరణ ప్రక్రియ జరిగిందా ?అని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు, సోషల్ మీడియా జవాబుదారీతనం కఠినంగా ఉందని మంత్రి అన్నారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంటే.. మరింత కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను అందించడానికి సిద్ధంగా ఉన్నామనీ, మన పౌరుల రక్షణ కోసం, తాము నిబంధనలను కఠినంగా చేయాలని, వ్యక్తిగతంగా నమ్ముతున్నానని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పాడు.
ఈ విషయం రాజ్యాంగ పరిధిలో వస్తుందనీ, ఇరు రాష్ట్రాలు, కేంద్రం పాత్రను దృష్టిలో పెట్టుకుని చూడాల్సి ఉందన్నారు. ఈ మేరకు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరముందని అన్నారు. ధిక్కరించేలా వ్యవహరించిన ట్విట్టర్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళలను రక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఏదైనా సైబర్ క్రైమ్ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడిందనీ, దానిని సెంట్రల్ పోర్టల్‌లో నివేదించవచ్చని, అది సంబంధిత చట్ట అమలు సంస్థకు వెళుతుందని ఆయన తెలిపారు.
సోషల్ మీడియా ప్రబలం అన్నింటిలోనూ ఉంది.మన నిత్య జీవితాల్లో దీని ప్రాముఖ్యత పెరుగుతోంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా.. ఎలా సురక్షితంగా, జవాబుదారీగా చేయాలనే దానిపై ప్రభుత్వం 2021లో సోషల్ మీడియా కోసం సమగ్ర మధ్యవర్తిత్వ నియమాలు, మార్గదర్శకాలను తీసుకువచ్చిందని వైష్ణవ్ చెప్పారు. సోషల్ మీడియాను జవాబుదారీగా చేసేందుకు ముఖ్యమైన ఐదు సోషల్ మీడియా మధ్యవర్తులను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని చెప్పారు. అవన్నీ కూడా నెలవారీగా నివేదికలు సమర్పించాల్సి ఉందన్నారు.
