చెన్నై: పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ఎస్ఐ లాడ్జీకి తీసుకెళ్లిన సంఘటన తూత్తుకూడిలో సంచలనం సృష్టించింది.తూత్తుకూడి జిల్లా శ్రీవైకుంఠం సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీస్‌స్టేషన్  తుంగనల్లూరు సమీపంలో ఉంది.

ఈ ప్రాంతంలో ఓ మహిళ కుమారుడు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని  ఓ స్థానిక నాయకుడు ఎనిమిది తులాల బంగారు నగలను తీసుకొని మోసం చేశాడు.  ఈ విషయమై ఆ మహిళ శ్రీ వైకుంఠం సబ్‌ డివిజన్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ ఫిర్యాదు తీసుకొన్న  ఎస్ఐ  కేసు విచారణ జరపకుండా మహిళను లొంగదీసుకొన్నాడు. రెండు రోజుల క్రితం మహిళను ఎస్ఐ  సమీపంలోని లాడ్జీకి తీసుకెళ్లి ఆమెతో గడిపాడు. ఈ విషయమై స్పెషల్ బ్రాంచీ పోలీసులు విచారణ జరిపి తూత్తుకూడి ఎస్పీకి నివేదిక అందించారు.