లూథియానా:  పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా సెంట్రల్ జైలులో గురువారం నాడు పోలీసులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో పలువురు ఖైదీలు గాయపడ్డారు. ఖైదీల మధ్య ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు.

జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకొందని  పోలీసులు తెలిపారు.  ఈ ఘర్షణను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, అధికారులు మాత్రం ఈ విషయాన్నిధృవీకరించలేదు.

డిప్యూటీ కమిషణర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్  జైలు ప్రాంతానికి చేరుకొన్నారు.  ఈ ప్రాంతంలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనను అవకాశంగా తీసుకొని కొందరు ఖైదీలు తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కరిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకొన్నారు.