ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకం.. ఎవరంటే?

ప్రధాన మోడీ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. కేరళకు చెందిన జ్ఞానేశ్వర్ కుమార్, పంజాబ్‌కు చెందిన సుఖ్‌బిర్ సింగ్ సంధులను నియమించింది.
 

selection committee led by pm narendra modi appoints two election commissioners kms

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎంపిక కమిటీ ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. ఈ ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లే కావడం గమనార్హం. కేరళకు చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జ్ఞానేశ్వర్ కుమార్, ఉత్తరాఖండ్ క్యాడర్.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుఖ్‌బిర్ సింగ్ సంధులను ఈ సెలెక్షన్ కమిటీ కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా నియమించింది.

ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వెల్లడించారు. అధిర్ రంజన్ చౌదరి కూడా సెలెక్షన్ కమిటీలో ఉన్నారు. ప్రధానమంత్రి సారథ్యంలోని ఈ సెలెక్షన్ కమిటీలో కేంద్ర మంత్రి, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎంపీ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. 

గతంలో ఈ సెలక్షన్ కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండేవారు. కానీ, ఈ మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదంతో చట్ట సవరణ చేసింది. ఈ సవరణ తర్వాత ఏర్పడ్డ తొలి సెలెక్షన్ కమిటీ ఇదే.

ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే ఈ ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు. కాగా, అరుణ్ గోయల్ మాత్రం అందరికీ షాక్ ఇస్తూ రాజీనామా చేశారు. ఆయన పదవీ విరమణతో కేంద్ర ఎన్నికల సంఘలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. సాధారణంగా ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. లోక్ సభ ఎన్నికల సమయం దగ్గర పడ్డ సందర్భంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో సెలెక్షన్ కమిటీ వేగంగా ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios