Asianet News TeluguAsianet News Telugu

పార్లమెంట్ ఆవరణలోకి రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన కారు

పార్లమెంట్ ఆవరణలో మంగళవారం నాడు ఓ కాంగ్రెస్ ఎంపీ కారు కలకలం సృష్టించింది. ఈ కారు తప్పుడు మార్గంలో పార్లమెంట్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటనపై సెక్యూరిటీ  సిబ్బంది విచారణ నిర్వహిస్తున్నారు.

Security scare at Parliament as Congress' Lok Sabha MP's car tries to enter from exit gate
Author
New Delhi, First Published Feb 12, 2019, 5:09 PM IST


న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో మంగళవారం నాడు ఓ కాంగ్రెస్ ఎంపీ కారు కలకలం సృష్టించింది. ఈ కారు తప్పుడు మార్గంలో పార్లమెంట్‌లోకి ప్రవేశించింది. ఈ ఘటనపై సెక్యూరిటీ  సిబ్బంది విచారణ నిర్వహిస్తున్నారు.

మణిపూర్ రాష్ట్రానికి చెందిన  ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ టి. మేనియాకు చెందిన కారుగా గుర్తించారు.ఈ కారు నెంబర్ ను డీఎల్ 12 సిహెచ్ 4897 నెంబర్ గా  గుర్తించారు. ఈ కారుకు  ఎంపీ స్టిక్కర్ కూడ అంటించి ఉంది.

బయటకు వెళ్లే గేటు నుండి ఈ కారు పార్లమెంట్ లోపలికి ప్రవేశించింది. ఈ కారు తప్పుడు మార్గంలో పార్లమెంట్‌లోకి ఎలా ప్రవేశించిందనే కోణంలో  పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటన 2001లో పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనను గుర్తు చేస్తోందని పలువురు గుర్తు చేసుకొన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios