కృష్ణా జిల్లా వైసీపీలో వర్గ విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. రైతు భరోసా కేంద్రం శంకుస్థాపనలో రెండు వర్గాలు బాహాబాహీగా తలపడటం రాళ్లు రువ్వుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్ధితి తలెత్తింది.

కార్యక్రమానికి హాజరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కళ్లముందే ఈ గొడవ జరిగింది. బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో వైసీపీలోని రెండు వర్గాలు పాలు పంచుకున్నాయి.

ఓ వర్గం పూజలు చేస్తున్న సమయంలో మరో వర్గం దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో గొడవ జరిగింది. ఎమ్మెల్యే వంశీ ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎవ్వరూ తగ్గకుండా ఒకరిపై ఒకరు తోపులాటకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వుకోవడంతో పాటు చివరికి చేయి చేసుకునేవరకు కూడా పరిస్థితి చేయి దాటిపోయింది.