Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 1 నుంచి పూణేలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం - డిప్యూటీ సీఎం అజిత్ పవార్

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పూణెలోని విద్యా సంస్థలు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 1-8 తరగతుల వారికి ఆఫ్ డే స్కూల్, మిగితా అందరికి యథా ప్రకారం క్లాసులు కొనసాగుతాయని చెప్పారు. 

Schools and colleges to open in Pune from February 1 - Deputy CM Ajit Pawar
Author
Pune, First Published Jan 29, 2022, 4:22 PM IST

పూణెలోని స్కూళ్లు (schools), కాలేజీ (collages)లు ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభమవుతాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (ajith pawar) ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 1 నుండి 8 తరగతుల పిల్లలకు హాఫ్ డే స్కూల్ ఉంటుంద‌ని చెప్పారు. కానీ 9,10 తరగతుల స్టూడెంట్ల‌కు గ‌తంలో మాదిరిగానే ఫుల్ డే స్కూల్ కొనసాగుతుంద‌ని అన్నారు. కాలేజీలు కూడా య‌థావిధిగానే న‌డుస్తాయ‌ని తెలిపారు. 

అయితే, విద్యా సంస్థల‌ను పునఃప్రారంభించే విషయమై తల్లిదండ్రుల త‌మ అభిప్రాయాలను తెలియ‌జేయాల‌ని కోరారు. ‘‘ పిల్లలు స్కూల్స్ కు హాజరు కావాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా అవసరం. 1 నుండి 8 తరగతులకు సంబంధించి తదుపరి సమావేశంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. 9వ తరగతి, దాని కంటే ఎక్కువ తరగతుల పిల్ల‌లు స్కూళ్ల‌కు హాజ‌రుకావ‌డం వ‌ల్ల వ్యాక్సినేష‌న్ (vaccination) కార్య‌క్ర‌మం వేగ‌వంతం అవుతుంద‌ని అజిత్ ప‌వార్ అభిప్రాయ‌ప‌డ్డారు. రెండు డోసుల వ్యాక్సిన్‌లు పొందిన విద్యార్థులు మాత్ర‌మే ఆఫ్‌లైన్ తరగతులకు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతించారు. కాబ‌ట్టి స్కూల్ కు వ‌చ్చేందుకు త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ వేసుకుంటార‌ని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ (mask) త‌ప్ప‌ని స‌రిగా ఉప‌యోగించాల‌ని అజిత్ ప‌వార్ అన్నారు. 
అన్నారు. మాస్క్ వాడ‌కంపై ప్ర‌త్యేకంగా ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

కోవిడ్ -19 (covid -19) కేసులు పెర‌గ‌డం వ‌ల్ల మహారాష్ట్ర ప్ర‌భుత్వం స్కూళ్ల‌ను మూసివేయాల‌ని ఈ నెల ప్రారంభంలో నిర్ణ‌యించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ల‌ను, కాలేజీల‌ను మూసేశారు. అప్పటి నుంచి ఆన్ లైన్ క్లాసుల‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే పిల్లలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల నేర్చుకోవ‌డంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, తిరిగి వాటిని మొద‌లు పెట్టే అంశాన్ని ప‌రిగణ‌లోకి తీసుకోవాల‌ని పేరెంట్స్ అసోసియేషన్, పలువురు మంత్రులు సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేకు, సీఎంవోకు ప్రతిపాదనలు అందించారు. ఈ విష‌యంలో విద్యా శాఖ మంత్రి వ‌ర్ణా గైక్వాడ్ కు ప్ర‌త్యేకంగా విన‌తులు అందాయి. దీంతో ఈ నెల 20వ తేదీన జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో స్కూళ్లు ఓపెన్ చేసే విష‌యాన్ని విద్యా శాఖ మంత్రి సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ఎదుట ప్ర‌తిపాదించారు. నిపుణులు, త‌ల్లిదండ్రులు అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకు్న సీఎం.. విద్యా సంస్థ‌లు ఓపెనింగ్ కు ప‌చ్చ జెండా ఊపారు. జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి విద్యా సంస్థ‌లు ప్రారంభించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. అయితే ఈ విష‌యంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం మాత్రం స్థానిక అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు అప్ప‌జెప్పారు. ఆ ఆదేశాల్లో భాగంగానే వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి పుణేలో విద్యా సంస్థ‌ల ప్రారంభానికి మంత్రి అజిత్ ప‌వ‌ర్ నేడు నిర్ణ‌యం తీసుకున్నారు. 

ఇది ఇలా ఉండ‌గా.. గ‌డిచిన 24 గంట‌ల్లో పూణేలో 7,166  కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 13,88,687 కు చేరుకున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 12 మంది మ‌ర‌ణించారు. దీంతో మ‌ర‌ణాలు 19,429 కు చేరుకున్నాయ‌ని ఓ అధికారి తెలిపారు. శుక్రవారం నాటికి జిల్లాలో ఇన్‌స్టిట్యూషనల్ ఐసోలేషన్‌లో 2,520, హోమ్ క్వారంటైన్‌లో 73,471 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయ‌న చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios