శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన ప్రముఖ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

భారత్‌లోనే కాకుండా యూరప్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల్లో ఆయన అనేక ప్రదర్శనిలిచ్చారు. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ అల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన అతికొద్ది మంది భారతీయ విద్వాంసుల్లో ఆయన కూడా ఒకరు.

కర్ణాటక సంగీతానికి ఆయన అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దీనితో పాటు మంగుళూరు, బెంగళూరు యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి.

గోపాల్‌నాథ్ మరణం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గోపాల్‌నాథ్ అంత్యక్రియలు శనివారం మంగుళూరులో జరగనున్నాయి.