లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మారారు. అధిర్ రంజన్ చౌధరి స్థానంలో రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ నియమితులయ్యారు. పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలకు కాంగ్రెస్ పక్షనేతగా బిట్టూ విధులు నిర్వర్తించనున్నారు.

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న అధిర్‌..  మరో రెండు నెలల వరకు ప్రచారంలో పాల్గొననుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.

రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ పంజాబ్‌ మాజీ సీఎం బియాంత్‌ సింగ్‌ మనవడు. మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన గతేడాది ఆగస్టులో లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీ విప్‌గా నియమితులయ్యారు.

45 ఏళ్ల రవ్‌నీత్‌ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో పంజాబ్‌లోని ఆనంద్‌పూర్‌ సాహిబ్‌ నుంచి, 2014, 2019 ఎన్నికల్లో లుధియానా నుంచి విజయం సాధించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన రవ్‌నీత్‌కు పంజాబ్‌ కాంగ్రెస్‌ అభినందనలు తెలిపింది.