కేరళలో  ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నిందితులుగా ఉన్నవారు నిర్ధోషులుగా విడుదల కావడంపై  బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్  తీవ్ర స్థాయిలో స్పందించారు.
ట్విట్టర్ పోస్ట్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ కేసుపై  మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పందించాలని కోరారు. ఇద్దరు చిన్నారులను  దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసును  జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ  కమిషన్ సూమోటొగా తీసుకుని లోతుగా విచారించాలని కోరారు.

రాజకీయహత్యలను తీవ్రమైన నేరాలగా కప్పిపుచ్చే ప్రయత్నాలు  రాజకీయ  ప్రాసిక్యూషన్  వైపు నుంచి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ అనే హాష్ ట్యాగ్‌తో  ప్రధాని కార్యాలయానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, కేరళ గవర్నర్‌కు ఆ పోస్ట్ ట్యాగ్ చేశారు


హిందూ వాది, కేరళ హిందూ హెల్ప్ లైన్ వ్యవస్ధాపకులు ప్రతీష్ విశ్వనాధ్ పోస్ట్‌ను రీట్విట్ చేస్తూ రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో ఈ పోస్ట్‌ను పెట్టారు. ఆ ట్వీట్‌లో ఆయన కేరళ ప్రభత్వంపై తీవ్ర  స్థాయిలో మండిపడ్డారు.

 "పొస్ట్ మార్టం నివేదికలో వారిద్దరిపై లైంగిక దాడి చేసి చంపినట్లుగా సృష్టమవుతుంది. కానీ ఈ కేసులోనిందితులుగా ఉన్నవారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పోలీసుల  నిర్లక్ష్య వైఖరి కారణంగానే  నిందితులు శిక్ష నుంచి తప్పించుకున్నారు. మెుదటి నుంచి పోలీసులువారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న  కేరళ ముఖ్యమంత్రి నిందితులకు శిక్ష పడేలా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు" అంటూ పోస్ట్ చేశారు.

అయితే కేసు పుర్వాపరాలను పరిశీలిస్తే   2017లో  పాలక్కాడ్ జిల్లాలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ళు  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 2017 జనవరిలో 11 ఏళ్ల
మాలతి అనే చిన్నారి  ఇంట్లో శవమయి కనిపించింది.

రెండు నెలల తరువాత అంటే మార్చి 4 న మాలతి సోదరి రాణి కూడా  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటనలు కేరళ రాష్ట్రంలో సంచలనం రేపాయి. వారి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  విచారణ చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు, వారిపై పోస్కోతో పాటు వివిధ సెక్షన్‌ల కేసులు నమోదు చేశారు.

రెండేళ్ళకు పైగా ఈ కేసును విచారణ చేపట్టిన కోర్టు చివరకు ముగ్గురు నిందితులను నిర్ధోషులుగా విడుదల చేసింది.ఈ కేసులో నిందితులపై అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందంటూ ఆరోపించింది.