Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యక్

రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురయ్యింది. దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో ట్విట్టర్ అకౌంట్ల హ్యాకింగ్ ఘటనలు అధికమవుతున్నాయి. 

Rajasthan Governor Twitter Account Hacked
Author
Jaipur, First Published Jan 24, 2022, 12:39 PM IST

ఇటీవ‌ల ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ (twitter) అకౌంట్లు త‌ర‌చూ హ్యాకింగ్ కు గురువుతున్నాయి. అనేక మంది ప్రముఖ ప్రభుత్వ అధికారులు, సంస్థల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ పోయిన వీకెండ్ లో హ్యాకింగ్ (hacking) కు గురయ్యాయి. అకౌంట్ల పేర్లు మార్చడంతో పాటు ఆ అకౌంట్ల ద్వారా ఊర్దు భాష‌లో రాసిన పోస్ట్ లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

ఆదివారం మధ్యాహ్నం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఖాతాలో అరబిక్‌లో ఒక ట్వీట్ పోస్ట్ అయ్యింది. దీంతో పాటు హర్యానా ఎమ్మెల్యే. కాంగ్రెస్ నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ట్విట్ట‌ర్ అకౌంట్ పేరు ‘‘@iLoveAlbaik’’గా మార్చబడింది. వీటి ద్వారా ఉర్దూలో పోస్ట్‌లు చేయబడ్డాయి. అయితే తాజాగా రాజస్థాన్ రాజ్ భవన్‌లో ద్వారా అందిన సమచారం ప్రకారం.. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ఖాతా కూడా హ్యాక్ కు గురయ్యింది. త‌న సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ గుర‌య్యాయ‌ని ఆయ‌న సంబంధిత కేంద్ర అధికారుల‌కు గ‌వ‌ర్న‌ర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) అధికారిక ట్విట్టర్ ను హ్యాకింగ్ నుంచి తిరిగి తీసుకున్న ఒక రోజు త‌రువాతే ఇవి చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న‌క‌రం.  

శనివారం NDRF అధికారిక ట్విటర్ అకౌంట్ ఇదే ర‌క‌మైన ఇబ్బందిని ఎదుర్కొంది. హ్యాకర్లు ఈ అకౌంట్ ద్వారా విద్వేష‌పూరిత సందేశాలు పోస్టు చేశారు. ఈ అకౌంట్ పేరు, ఫొటోలు కూడా మార్చారు. ఈ అకౌంట్ శనివారం రాత్రి 10.45 గంటలకు హ్యాకింగ్ కు గుర‌వ్వ‌గా.. సైబ‌ర్ నిపుణులు వెంట‌నే రంగంలోకి దిగారు. దానిని కేవ‌లం 2-3 నిమిషాల్లో హ్యాకింగ్ నుంచి విడిపించారు. ఫొటో, పేరును పునరుద్ధరించారు. ఇకపై ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేస్తామ‌ని NDRF డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. ఇప్పుడు జ‌రిగిన హ్యాకింగ్ పై NDRF ఢిల్లీ పోలీస్ సైబర్ ఇన్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌కి ఫిర్యాదు చేసింది.

ఇదే ర‌కంగా జనవరిలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క ట్విట్టర్ ఖాతా హ్యక్ అయ్యింది. ట్విట్టర్ అకౌంట్ పేరు ‘ఎలోన్ మస్క్’గా మార్చబడింది. ఆ శాఖ‌కు సంబంధం లేని పోస్టులు ఆ అకౌంట్ నుంచి వెలువ‌డ్డాయి. దీంతో వెంట‌నే స్పందించిన అధికారులు అకౌంట్ ను కొన్ని నిమిషాల్లోనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అందులో పోస్ట్ ల‌ను తొల‌గించారు. గతేడాది డిసెంబర్‌ మధ్య కాలంలో ప్రధాని న‌రేంద్ర మోదీ ట్విట్టర్ అకౌంట్ కు హ్యాక్ కు గుర‌య్యింది. దీంతో ఆ స‌మ‌యంలోనే ఈ సైబ‌ర్ దాడుల‌పై చ‌ర్చ మొద‌లైంది. ఆ అకౌంట్ ద్వారా క్రిప్టో క‌రెన్సీని భార‌త ప్ర‌భుత్వం అధికారికంగా గుర్తించినట్టు పోస్టులు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే స్పందించిన అధికారులు అకౌంట్ ను అదుపులోకి తీసుకున్నారు. కొంత సమ‌యం త‌రువాత ఆ పోస్ట్ ల‌ను డిలీట్ చేశారు. ఈ ఘటన తరువాత అనేక మంది ప్రతిపక్ష నాయకులు దీనిని చాలా ఆందోళన కలిగించే అంశం గా ప‌రిగ‌ణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios