బీహార్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం  71 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. ఈ టైంలో రాహుల్ గాంధీ ట్వీట్ అక్కడ ప్రకంపనలు సృష్టించింది. బీహార్ ఎన్నికల్లో ఓటర్లు గ్రాండ్ అలయెన్స్ కే ఓటు వేయాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. పోలింగ్ రోజు ఇలా ప్రచారం చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని బీజేపీ మండిపడుతోంది. 

ఇది ఉద్యోగం, ఉపాధి, సమాన న్యాయం, రైతు కూలీలగురించి ఆలోచించాల్సిన సమయం. గ్రాండ్ అలయెన్స్ కే మీ ఓటు వేయండి. మీ అందరికీ మొదటి దశ పోలింగ్ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ Bihar will change today అనే హాష్ ట్యాగ్ ను ఇచ్చాడు. 

దీనిమీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో బీజేపి ఉంది. పోలింగ్ రోజు ఫలానా పార్టీకి ఓటే వేయమని చెప్పడం ఎన్నికల కోడ్ ను ఉల్లంంఘించడమే అని బీజేపీ అంటోంది. 

బీహార్ లో మొదటి దశ పోలింగ్ లో భాగంగా  16 జిల్లాల్లోని 11 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో 1066 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 952 మంది పురుషులు, 114 మంది మహిళలు ఉన్నారు. రెండవ దశ ఓటింగ్ నవంబర్ 7 న జరుగుతుంది. నవంబర్ 10 న ఫలితాలు వస్తాయి.