రాజు ఆత్మ ఈవీఎంలో ఉంది - ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు..

ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడి చాలా మంది బీజేపీ వైపు వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ముంబైలో నిర్వహించిన భారత్ జోడో న్యాయ్ మంజిల్ ర్యాలీలో ఆయన ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.

Rahul Gandhi attacks PM Narendra Modi..ISR

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఆదివారం ముంబైలో శివాజీ పార్కులో 'భారత్ జోడో న్యాయ్ మంజిల్' పేరుతో నిర్వహించిన ఇండియా కూటమి భారీ ర్యాలీలో ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) ట్యాంపరింగ్ చేయడం ద్వారా బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందని పలువురు ప్రతిపక్ష నేతలు చెబుతున్న ఈవీఎం వివాదాన్ని ప్రస్తావిస్తూ 'రాజా కీ ఆత్మ ఈవీఎం మే హై (రాజు ఆత్మ ఈవీఎంలో ఉంది) అని రాహుల్ గాంధీ

‘‘హిందూ మతంలో శక్తి అనే పదం ఉంది. మనం ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఇంతకీ ఆ శక్తి ఏంటి అన్నదే ప్రశ్న. రాజు ఆత్మ ఈవీఎంలో ఉంది. ఇది నిజం. ఈవీఎంలలో, దేశంలోని ప్రతి సంస్థలో, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలో రాజు ఆత్మ ఉంది.’’ అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ‘‘మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ను వీడి మా అమ్మ ముందు ఏడ్చి.. సోనియా జీ, ఈ శక్తితో పోరాడే శక్తి నాకు లేనందుకు నేను సిగ్గుపడుతున్నాను. నేను జైలుకు వెళ్లడం ఇష్టం లేదని అన్నారు. ఇలా వేలాది మందిని బెదిరిస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలకు భయపడి బీజేపీ వైపు వెళ్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మీడియా, సోషల్ మీడియా సహా దేశంలోని కమ్యూనికేషన్ వ్యవస్థ దేశం చేతిలో లేనందునే తాము ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. ‘నిరుద్యోగం, హింస, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు వంటి ప్రజలకు సంబంధించిన అంశాలను చూపించడం లేదు. దేశం దృష్టిని ఆకర్షించడానికి 4,000 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది’ అని రాహుల్ గాంధీ అన్నారు.

అనంతరం ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేసేందుకే రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని కొనియాడారు. ‘‘నేటి రోజుల్లో చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడానికి ఆయన (రాహుల్ గాంధీ) ప్రయత్నించారు. భారత రాజ్యాంగాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాపాడేందుకు, విద్వేషాన్ని ఓడించడానికి ఆయన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'ను ప్రారంభించారని, అందుకు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని అన్నారు. 

తరువాత పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ‘‘ మీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) పేరులో గాంధీ ఉన్నారు. దానికి బీజేపీ భయపడుతోంది. విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఇది భారతదేవం. ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలకు రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉంది. అదే ఓటు’’ అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios