Asianet News TeluguAsianet News Telugu

భార్యతో గొడవ.. ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి..హైటెన్షన్ వైర్ ను కొరికేసిన భర్త..

మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన అతడు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి హైటెన్షన్ వైరును కొరికేశాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

quarrel with wife  Man climbs on transformer, chews electric wires  KRJ
Author
First Published Apr 6, 2023, 4:27 PM IST

భార్య భ‌ర్తల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం చాలా సాధారణం. సంసారం అన్న తరువాత ఆలుమగల మధ్య చిన్నచిన్న గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉంటాయి. అయితే.. గొడ‌వ‌లు జరిగిన వెంటనే ఇద్దరు సర్దుబాటు చేసుకుంటే.. సంసారం సాఫీగా సాగిపోతుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ఉండవు. కానీ, ఆ గొడ‌వ‌లు పెద్ద‌గా మారితే మాత్రం ఆందోళ‌న చెందాల్సిన విష‌య‌మే. గొడ‌వ‌లు పెరిగితే భార్యాభర్త‌ల మ‌ధ్య దూరం కూడా పెరుగుతుంది.

ఆ దూరం పెరిగితే.. వారిని ఎంత క‌ల‌పడానికి ప్ర‌య‌త్నించిన ఫలితం ఉండదు. కొన్ని సార్లు ఆ గొడ‌వ‌లతోనే ఇద్ద‌రూ విడిపోవచ్చు కూడా. ఈ ఇలాంటి సందర్భంలోనే భార్యాభర్తలలో ఎవ‌రో ఒక‌రు త‌గ్గ‌డం లేదా వారి పెద్దలు కలుగచేసుకోని ఆ గొడ‌వలకు పులిస్టాప్ పెట్టాలి. లేదంటే.. తీవ్ర అనార్థాలకు దారి తీస్తాయి. అంటే.. ఒకరినొరకు చంపుకోవడమో.. లేదా ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతుంది. తాజాగా ఈ కోవకు చెందిన ఘటననే తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో వెలుగు చూసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే..చిన్నమంగోడు ప్రాంతానికి చెందిన ధర్మదురై(33)కి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ధర్మదురై భార్య తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో ధర్మదురై  తన బావమరుదులపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్యను తిరిగి తీసుకురావాలని ధర్మదురై పోలీసులను కోరాడు. అయితే మద్యం మత్తులో ఉన్న అతన్ని పోలీసులు వేచి ఉండమని కోరారు.

వారి సూచన మేరకు కాసేపు వెయిటింగ్ రూంలోనే గడిపిన అతడు ఆ తరువాత అకస్మాత్తుగా బయటకు వెళ్లి సమీపంలోని  విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కాడు. చుట్టూఉన్నవారు ఎంత వారిస్తున్నా వినలేదు.  అక్కడ ఉన్న పోలీసులు కూడా కిందకు దిగమని కోరారు. అయినా..ధర్మదురై ఎవరి మాట వినకుండా హైవోల్టేజీ కరెంట్‌ తీగలను కోరికేశాడు.

ప్రాణాపాయ స్థితిలో 

ధర్మదురై తీగను తాకగానే నిప్పురవ్వ రావడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.ఆ వెంటనే నేలపై పడిపోయాడు. అదే సమయంలో కింద నిల్చున్న పోలీసు ధర్మదురైని హుటాహుటిన తీసుకెళ్ళి చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ధర్మదురై ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కుతున్న దృశ్యాలను చూడవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios