Asianet News TeluguAsianet News Telugu

Punjab Election 2022: పంజాబ్‌లో ఎన్డీఏ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ.. బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Punjab Assembly Election 2022) బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, మరో మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి బీజేపీ కూటమిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

Punjab Election 2022 BJP To Contest 65 Seats Amarinder Singh Party in 37 seats
Author
Chandigarh, First Published Jan 24, 2022, 4:55 PM IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Punjab Assembly Election 2022) బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ ఎన్నికల్లో స్థానాల్లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ, మరో మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్‌తో కలిసి బీజేపీ కూటమిగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నికల్లో మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సోమవారం ప్రకటన చేశారు. పంజాబ్‌ ఎన్నికల్లో బీజేపీ 65 స్థానాల్లో, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ 15 స్థానాల్లో పోటీ చేయనున్నాయని వెల్లడించారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం అని.. భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశమని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. రక్షణ దళాలకు పంజాబ్ అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు.

‘పంజాబ్ దేశానికి దార్శనికత, దిశ, బలాన్ని ఇచ్చింది. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం.. భద్రతా సమస్యలతో పోరాడుతోంది. పంజాబ్‌లో డ్రగ్స్, ఆయుధాలు సరఫరా చేయడానికి సరిహద్దు అవతల నుంచి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమి భద్రత కల్పించడమే కాకుండా.. పంజాబ్‌కు, దేశానికి స్థిరత్వం అందిస్తుంది’ అని జేపీ నడ్డా మీడియా సమావేశంలో చెప్పారు. 

ఇక, ఇప్పటికే తన Punjab Lok Congress పార్టీ తరఫున 22 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అమరీందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. ఇందులో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ పేరు కూడా ఉంది. అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. ‘ప్రాంతాలు, సమాజంలోని వివిధ వర్గాలలో తగిన ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తూ.. గెలుపుపై ​​స్పష్టమైన దృష్టితో మేము మంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నాం’ అని అమరీందర్ సింగ్ తెలిపారు.

ఇదిలా ఉంటే బీజేపీ కూడా 34 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, పంజాబ్‌లోని మొత్తం 117 మంది స్థానాలకు ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios