Punjab Assembly Election 2022:ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పై చేసిన కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు సమంజసమేననీ, ఈ వ్యాఖ్యలపై నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని మోడీని పంజాబ్ సీఎం చన్నీ కోరారు. పంజాబీ ప్రజల ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.
Punjab Assembly Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పార్టీల మధ్య .. మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దింపేందుకు ఆప్ తో పాటు బీజేపీ కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ ఏ పార్టీ కూడా వదులుకోవడం లేదు.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ని టార్గెట్ చేసింది. ఆప్ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్.. కేజ్రివాల్ పై చేసిన ఆరోపణల్ని టార్గెట్ చేశారు. వీటిపై దర్యాప్తు చేయించాలని ప్రధాని మోడీని సీఎం చన్నీ కోరారు.
నేటితో పంజాబ్ ఎన్నికల ప్రచారానికి తెర పడుతుందటంతో ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ వివరణ తన యూపీ,బీహార్,ఢిల్లీ దే భాయీ వ్యాఖ్యపై రాజకీయ దాడి నుండి తెలివిగా తప్పించుకునేందుకు పంజాబ్ సీఎం చన్నీ ఎదురుదాడి ప్రారంభించారు. కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఖలిస్తాన్ వ్యాఖ్యల్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఈ వీడియోను సోషల్ మీడియా, టీవీ ఛానెల్‌లలో ప్రసారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని EC తెలిపింది.
కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు వీడియో ప్రసారం చేయకుండా ఆపాలని ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా ఎన్నికల అధికారాన్ని కోరిన తర్వాత EC ఈ నిర్ణయం తీసుకుంది. ఆప్ ప్రతిష్టను దిగజార్చాలనే కుమార్ విశ్వాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు రాఘవ్ చద్దా వాదించారు. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు అన్ని పార్టీలు ఒక్కటయ్యాయనీ, ఈ కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ, అకాలీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు నిరంతరం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారనీ, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారని చద్దా తెలిపారు.
ఇదిలా ఉంటే.. కేజ్రివాల్ పై చేసిన కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలు సమంజసమే అని ఈసీ నమ్మినట్లయిందని చన్నీ భావిస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని ప్రధాని మోడీని చన్నీ కోరారు.
రాజకీయాలను పక్కన పెడితే.. వేర్పాటువాదంపై పోరాడుతున్నప్పుడు పంజాబ్ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారని, కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తునకు ఆదేశించాలని చన్నీ ప్రధాని మోదీని అభ్యర్థించారు. గౌరవనీయులైన ప్రధాని ప్రతి పంజాబీ యొక్క ఆందోళనను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లేఖను పంచుకుంటూ ట్విట్టర్‌లో రాశారు.
యూపీ-బీహార్ వ్యాఖ్యల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే కుమార్ విశ్వాస్ కేజ్రివాల్ పై చేసిన ఆరోపణలపై చన్నీ విచారణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చన్నీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు తీవ్ర నష్టం కలిగించినట్లు సొంత పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. వీటిపై చన్నీతో ప్రియాంక గాంధీ, ఇతర నేతలు కూడా ఇప్పటికే వివరణ కూడా ఇచ్చారు.
