Asianet News TeluguAsianet News Telugu

సైకోగా మారిన సైకాలజీ స్టూడెంట్.. ఇద్దరు స్నేహితుల్ని కాల్చేశాడు...

ఉత్తరప్రదేశ్ లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ పీజీ విద్యార్థి తోటి విద్యార్థిపై కాల్పులకు పాల్పడ్డాడు. మరో యువతిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, ఝాన్సీలోని బుందేల్ ఖండ్ కాలేజీలో జరిగింది. 

psychology student gun fire on his two friends in uttar pradesh - bsb
Author
Hyderabad, First Published Feb 20, 2021, 3:01 PM IST

ఉత్తరప్రదేశ్ లో పట్టపగలే దారుణం జరిగింది. ఓ పీజీ విద్యార్థి తోటి విద్యార్థిపై కాల్పులకు పాల్పడ్డాడు. మరో యువతిపై కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్, ఝాన్సీలోని బుందేల్ ఖండ్ కాలేజీలో జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. మంథన్ సింగ్ సెంగెర్ అనే పీజీ సైకాలజీ చదివే విద్యార్థి కాలేజీకి వెళ్లి తరగతిలో తుపాకీతో తన స్నేహితుడు హుకుమేంద్రసింగ్ గుర్జార్ (22)ను కాల్చాడు. ఆ తరువాత వింతగా ప్రవర్తించాడు. ‘మంథన్ ఫినిష్డ్’ అంటూ క్లాస్ రూంలోని బోర్డు మీద రాశాడు. ఆ తరువాత సిప్రీ బజార్ ప్రాంతానికి వెళ్లి కృతికా త్రివేది అనే యువతిపై కాల్పులు జరిపాడు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా కృతికా త్రివేది మరణించింది. 

హుకుమేంద్ర సింగ్ ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. కాల్పుల శబ్దం వినిపించగానే కృతికా కుటుంబ సభ్యులు మంథన్ సింగ్‌ను పట్టుకొని కరెంట్ స్తంభానికి కట్టేశారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 

నిందితుడు మంథన్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నివారి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హుకుమేంద్ర, కృతికా విద్యార్థులు ఇద్దరూ ఝాన్సీ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు 2016 నుంచి మంచి స్నేహితులని కళాశాలో గుమాస్తాగా పని చేస్తున్న హుకుమేంద్ర మామ సంజయ్ సింగ్ తెలిపారు. 

తన స్నేహితులు అతని గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని కోపం పెంచుకున్న మంథన్‌ కాల్పులకు పాల్పడిట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios