Asianet News TeluguAsianet News Telugu

బిహార్‌లో దారుణం.. పోలీసు ఇంట్లోనే వ్యభిచారం నిర్వహించిన ఓ పార్టీ మహిళా నేత

బిహార్‌లో ఓ పోలీసు అధికారికి చెందిన ఫ్లాట్‌లోనే ఓ పార్టీకి చెందిన మహిళా నేత వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆడ పిల్లలను కిడ్నాప్ కూడా చేస్తున్నారు. అపహరణకు గురైన ఓ బాలికను గాలిస్తుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
 

prostitution racket busted at police personnel flat in bihar run by a woman leader of a party kms
Author
First Published May 30, 2023, 7:54 PM IST

పాట్నా: బిహార్‌‌లో ఓ దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో కాదు.. ఏకంగా పోలీసు అధికారి ఫ్లాట్‌లోనే వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆడ పిల్లలను కిడ్నాప్ చేసి.. ఈ వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఈ వ్యభిచారాన్ని ఓ రాజకీయ పార్టీకి చెందిన మహిళా నేత నిర్వహిస్తుండటం గర్హనీయం. ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న మహిళా నేత బచ్చీ దేవిని శనివారం పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాస్టిట్యూషన్ రాకెట్ నిర్వహిస్తున్నది గయాలో పోస్టింగ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారికి చెందిన ఫ్లాట్.

ఓ ఆడ పిల్ల కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. పాట్నాలోని చిత్కోరా ఏరియాలోని ఓ ఇంట్లో మైనర్ బాలిక పనికి వెళ్లుతుండేది. హఠాత్తుగా కొన్ని రోజుల నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆ ఇంటి యజమానికి ఫోన్ చేసి ఆరా తీయగా.. ఆమె గత వారం నుంచి పనికి రావడం లేదని తెలిపింది. 

ఆ బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా వారికి ఓ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తనను కొందరు నిర్బంధించారని, ఓ మహిళ తనను వ్యభిచార రొంపిలోకి బలవంతంగా దింపుతున్నదని ఆ బాలిక తెలిపింది. వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

Also Read: ఇంట్లోనే బాయ్‌ఫ్రెండ్‌తో కూతురు రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.. అప్పుడు బిడ్డ చేసిన దారుణమిదే

పాట్నా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ బాలిక చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ అపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లారు. శనివారం రాత్రే బచ్చి దేవిని అరెస్టు చేసినట్టు సోమవారం పోలీసులు తెలిపారు. ఆ ఫ్లాట్‌లో సెర్చ్ చేయగా.. కొన్ని అభ్యంతరక వస్తువులు లభించాయని, వాటిని రికవరీ చేసుకున్నట్టు ఫుల్వారి షరీఫ్ ఎస్‌హెచ్‌వో రంజిత్ రజక్ తెలిపారు.

బచ్చి దేవి నేమ్ ప్లేట్ కూడా అక్కడ కనిపించిందని, ఆమె పేరు, ఆమె ఏ పార్టీకి చెందిన మనిషో కూడా రాసి ఉన్నదని వివరించారు. ఆమె మొబైల్ ఫోన్ సీడీఆర్‌ను స్కాన్ చేస్తున్నామని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios