న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు అంశాల పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్రమోదీ చర్చించారు. జమ్ముకశ్మీర్ విభజన అనంతరం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలపై ట్రంప్ కు ప్రధాని మోదీ ఫిర్యాదు చేశారు. 

జమ్ముకశ్మీర్ పై పాక్ తీరును తప్పుబడుతూ ట్రంప్ కు ఫిర్యాదు చేశారు. జమ్ముకశ్మీర్ విభజన అనంతరం పాక్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో మోదీ ట్రంప్ కు ఫోన్ చేశారు. సుమారు అరగంట పాటు చర్చించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు భారత్ లో హింస చెలరేగేలా ఉన్నాయంటూ ఆరోపించారు. 

పాకిస్తాన్ కశ్మీర్లో హింసకు తావిచ్చేలా వ్యవహరిస్తోందని ట్రంపక్ కు ఫోన్లో తెలిపారు. కశ్మీర్ విషయంలో పూర్తిగా పాక్ ను తప్పుబడుతూ ఫిర్యాదు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉంటున్నాయని శాంతికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారంటూ మోదీ ట్రంప్ కు వివరించారు.  

ఇకపోతే జమ్ముకశ్మీర్ విభజన విషయంపై అగ్రదేశమైన అమెరికా స్పందించింది. భారత్ అంతర్భాగం అంశం కావడంతో దానిపై తాము ఎలాంటి స్పందన చేయబోమని తెలిపారు. అంతేకాదు భారత్ పై పాక్ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జమ్ముకశ్మీర్ విషయంలో అతి చేయోద్దు అంటూ సూచించారు. జమ్ముకశ్మీర్ విభజన అనంతరం భారత రాయబారిని పంపించి వేయడం, రైళ్లు నిలుపుదల, పాక్ రాయబారిని వెనక్కి పిలిపించడం వంటి పరిణామాలపై పాక్ కు మెుట్టికాయలు వేసింది అగ్రదేశం అమెరికా.