UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగారు. యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారంలోకి దిగారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానమంత్రి మోదీ ఎత్తిచూపారు మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడా ఓటర్లను అభివృద్ధి కోసం ఓటు వేయాలని కోరారు.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగారు. గెలుపు మీదా? మాదా? అన్నట్టు పోటా పోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారం ఒకరిపై మరొకరు విమర్శాస్త్రాలు సంధించుకుంటున్నారు. దీంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. గెలుపు తమ పార్టీది అంటే తామే అధికారంలోకి రాబోతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో తొలి దశ పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి.
ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్ ప్రచారంలో బీజేపీ తరుపున యోగి ఆదిత్యనాథ్ మద్దతుగా ప్రధాని మోడీ ప్రచారంలోకి దిగారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధానమంత్రి మోదీ ఎత్తిచూపారు మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్ మరియు నోయిడా ఓటర్లను అభివృద్ధి కోసం ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికలు యూపీ భద్రత, గౌరవం, శ్రేయస్సును కాపాడుకోవడానికేనని, ఈ ఎన్నికలు కొత్త చరిత్ర సృష్టించడానికి అని ప్రధాని అన్నారు.
ఈ తరుణంలో సమాజ్‌వాదీ పార్టీపై ఘాటైన విమర్శలు చేశారు. సురక్ష, సమ్మాన్, సమృద్ధి గురించి గుర్తు చేస్తూ.. యుపిలో శాంతి సుస్థిరత కోసం ఈ ఎన్నికలు వచ్చామని అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు, మాఫియాలు యోగి ప్రభుత్వం నియంత్రించిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేసినందుకు యోగి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. యూపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని, అయితే యూపీ సీఎం యూపీలో చట్టబద్ధ పాలనను నెలకొల్పారని ప్రశసించారు.
21వ శతాబ్దంలో.. యూపీకి రెట్టింపు వేగంతో నిరంతరం పనిచేసే ప్రభుత్వం అవసరమని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే దీన్ని చేయగలదని ప్రధాని మోదీ అన్నారు. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నాలుగింట మూడొంతుల ఆధిక్యంతో గెలిచిందనీ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిని బీజేపీ ఓడించిందని చెప్పారు. గడచిన ఐదేళ్ళలో ఉత్తర ప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. తన ప్రభుత్వ విధానాల వల్ల అన్ని వర్గాలు లబ్ధి పొందాయన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ఎవరూ వేలెత్తి చూపలేరని చెప్పారు.
ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటోందని, 100 ఏళ్లలో ప్రపంచ స్థాయిలో మానవజాతి ఇంతటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని ప్రధాని అన్నారు. ఈ సంక్షోభ సమయంలో కూడా, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రయోజనాలను తాము చూశామని అన్నారు.
ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పశ్చిమ యుపిలోని మీరట్, నోయిడా, ఘజియాబాద్, అలీగఢ్ మరియు హాపూర్ జిల్లాల ఓటర్లతో మాట్లాడారు. 'జన్ చౌపాల్'ని ఉద్దేశించి, ఈ సంవత్సరం ప్రారంభంలో మీరట్‌కు ప్రయాణిస్తున్నప్పుడు తన అనుభవాన్ని కూడా వివరించాడు.
“ఈ సంవత్సరం ప్రారంభంలో, నా మొదటి సందర్శన మీరట్. ఆ రోజు వాతావరణం బాగా లేకపోవడంతో రోడ్డు మీదుగా అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. కానీ ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా తాను గంటలోపే అక్కడికి చేరుకున్నానని చెప్పాడు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేసే అదృష్టాన్ని ప్రజలు తనకు అందించారని, బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టే చేస్తుందనడానికి ఇదే నిదర్శనమని ప్రధాని అన్నారు.
ఇదిలాఉంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈరోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఘజియాబాద్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అమ్రోహాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్నారు. అదే సమయంలో, సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్‌లోని సంయుక్త సమాజ్ మోర్చా మరియు సంయుక్త సంఘర్ష్ పార్టీతో సంబంధాలను తెంచుకుంది.
