ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో భక్తుల భద్రతకు ఏర్పాట్లు ... యోగి సర్కార్ చర్యలివే

ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 కోసం యోగి సర్కార్ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ముఖ్యంగా నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

 

Prayagraj Mahakumbh 2025 High Tech Divers and Boats on High Alert AKP

ప్రయాగరాజ్ : సనాతన ధర్మంలో అతిపెద్ద సామూహిక కార్యక్రమం ప్రయాగరాజ్ మహా కుంభమేళా. 2025 ఆరంభంలో అంటే రానున్న జనవరి, పిబ్రవరి నెలల్లో జరిగి ఈ మహోత్సవంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు యోగి సర్కార్ సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమాన్ని భద్రతా దృష్ట్యా విజయవంతం చేయడానికి పోలీసులు, పిఎసి, వైద్య సిబ్బందితో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్టిఆర్ఎఫ్ బృందాలు కలిసి పనిచేస్తున్నాయి. మహా కుంభమేళా సమయంలో 220 హైటెక్ డీప్ డైవర్స్, NDRF, SDRF సిబ్బంది 700 పడవలతో 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గోవా, కోల్‌కతా, మహారాష్ట్రతో సహా దేశంలోని అత్యుత్తమ జల పోలీసులను ప్రయాగరాజ్‌లో మోహరిస్తున్నారు. స్నానం చేసే భక్తులకు, సాధువులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో హైటెక్ డీప్ డైవర్లను నియమిస్తున్నారు.

24 గంటలు అప్రమత్తంగా

కిలా పోలీస్ స్టేషన్ జల పోలీసుల ఇన్‌చార్జి జనార్దన్ ప్రసాద్ సాహ్ని మాట్లాడుతూ... మహా కుంభమేళా సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 డీప్ డైవర్స్‌ను రప్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 39 మంది ఇక్కడికి చేరుకున్నారని... మొత్తం 220 మంది డైవర్స్ నీటిలో భద్రత కోసం అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

ముఖ్యమంత్రి యోగి ఆదేశాల మేరకు స్థానిక ప్రజల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. 40 అడుగుల లోతు వరకు వెళ్లగల స్థానిక కేవట్‌లు కూడా సహాయం చేస్తారన్నారు. భక్తులకు సహాయం చేయడానికి 10 కంపెనీల PAC, 12 కంపెనీల NDRF, 6 కంపెనీల SDRFని కూడా మోహరిస్తున్నారు.

200 మందికి పైగా స్థానికులు భద్రత 

మహా కుంభమేళాకు వచ్చే భక్తుల భద్రత కోసం ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నాయి. PAC, NDRF, SDRFతో పాటు ప్రయాగరాజ్ చుట్టపక్కల గ్రామస్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. జల పోలీసులు స్థానికుల బృందానికి శిక్షణ ఇస్తున్నారు. 200 మందికి పైగా స్థానికులు భక్తుల భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios