Asianet News TeluguAsianet News Telugu

ప్రశాంత్ కిశోర్ ఆంతర్యం: శరద్ పవార్ తో లంచ్, షారూక్ ఖాన్ తో డిన్నర్

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో శుక్రవారం లంచ్ చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సాయంత్రం బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తో డిన్నర్ చేశారు అయితే, ప్రశాంత్ కిశోర్ భేటీలో ఆంతర్యం ేమిటనేది తెలియడం లేదు

Prashant Kishor strategy: lunch with Sharad Pawar, Dinner with SRK
Author
Mumbai, First Published Jun 12, 2021, 10:07 AM IST

ముంబై: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం రాజకీయరంగంలో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో లంచ్ చేసిన ప్రశాంత్ కిశోర్ సాయంత్రం బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తో డిన్నర్ చేశారు. దాదాపు నాలుగు గంటల పాటు శరద్ పవార్ తో ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపారు 

సాయంత్రం బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ ను ఆయన నివాసం మన్నత్ లో కలిశారు. మర్యాదపూర్వకంగానే ఆయన షారూక్ ఖాన్ ను కలిసినట్లు చెబుతున్నారు. గత మూడేళ్లుగా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. తరుచుగా వారిద్దరు కలుసుకుంటూనే ఉన్నారు. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షారూక్ ను ప్రశాంత్ కిశోర్ కు పరిచయం చేశారు. షారూక్ ఖాన్ తో ప్రశాంత్ కిశోర్ భేటీలో ఏ విషయాలు చర్చకు వచ్చాయనేది తెలియడం లేదు. అయితే, మమత విజయానికి సహకరించినవారందరినీ కలుస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ చెప్పారు.

షారూక్ ఖాన్ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలను ఆయన సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. అదే సమయంలో ప్రశాంత్ కిశోర్ మీద షారూక్ కు సినిమా తీసే ఉద్దేశం లేదని కూడా చెబుతున్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెసు విజయం సాధించిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. కానీ ఆయన తన మనసు మార్చుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.  వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోడీకి ధిటైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

తమిళనాడులో విజయం సాధించిన స్టాలిన్ కు, పశ్చిమ బెంగాలో గెలిచిన మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన నాయకులను కలిసి ధన్యావాదాలు తెలపడానికి ప్రశాంత్ కిశోర్ తన పర్యటనను ఉద్దేశించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిశోర్ పర్యటన దానికి మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. 2024 ఎన్నికల గురించి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై వారిరువురి మధ్య చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. 

ప్రశాంత్ కిశోర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా అనే సందేహం కలుగుతోంది. ఏ పార్టీకి కూడా ఇక ముందు తాను పనిచేయబోననే నిర్ణయమాన్ని వెనక్కి తీసుకున్నారని కూడా ఉంటున్నారు. ఆయన రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి, మరింత విస్తృతంగా రాజకీయాలు చేయడానికి నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios