న్యూఢిల్లీ:   న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ  ఆదివారం నాడు నివాళులర్పించారు.  ప్రధాని మోడీ ఢిల్లీలోని గురుద్వారా రాకాబ్ గంజ్ సాహిబ్ కు వెళ్లారు.

గురుద్వార్ ప్రధాని సందర్శించేందుకు గాను ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదని అధికారులు తెలిపారు.  గురుతేజ్ బహదూర్ జీకి గుర్వారా రాకాబ్ గంజ్ సాహిబ్ వద్ద నివాళులర్పించినట్టుగా మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

 

హిందూ మతాన్ని పరిరక్షించడంతో పాటు మత సామరస్యం కోసం ఆయన చేసిన కృషిని మోడీ కొనియాడారు. గురు తేగ్ బహదూర్ జీకి శనివారం నాడు ట్వీట్ లో నివాళులర్పించారు. గురు తేజ్ బహదూర్ జీ జీవితం ధైర్యం , కరుణను సూచిస్తోందన్నారు.

గురు తేజ్ బహదూర్ సిక్కు మతానికి చెందిన 10 మంది గురువులలో తొమ్మిదోవాడు. గురు హర్గోబింద్  చిన్న కొడుకు. అతను 1621లో అమృత్‌సర్ లో మరణించారు. అతని బలిదానం గురుతేజ్ బహదూర్  యొక్క షాహీది దివాస్ జ్ఞాపకం ఉంది.