దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఆదివారం వరుసగా అయిదో రోజు కూడా ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌పై రూ. 28 పైసలు, డీజిల్‌పై రూ. 29 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలు ధరలను పెంచాయి.

పెరిగిన ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83.41, లీటర్‌ డీజిల్ ధర రూ.73.61కు చేరింది. ముంబయిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 90.05, డీజిల్‌ ధర రూ. 89.78కు చేరింది.

కాగా నవంబర్‌ 20 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. 17 రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్‌పై రూ. 2.35, లీటర్‌ డీజిల్‌పై రూ. 3.15 వరకు పెరిగాయి. 36.9 యూఎస్‌ డాలర్లుగా ఉన్న బ్యారెల్‌ ధర డిసెంబర్ 4 నాటికి 49.5 డాలర్లకు చేరింది.