Asianet News TeluguAsianet News Telugu

పెగాసస్ స్కాండల్ ఒక కట్టు కథ: ప్రభుత్వ సలహాదారు

పెగాసస్ వివాదం ఒక ఇండికేటివ్ లిస్ట్ చుట్టూ అల్లారా..? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండికేటివ్ లిస్ట్ నే పెగాసస్ లిస్ట్ కింద మీడియా సంస్థలు ప్రచురించాయా..?

 

Pegasus was a laughable snooping story spun around says Government adviser
Author
Hyderabad, First Published Jul 22, 2021, 12:29 PM IST

పెగాసస్ వివాదం ఒక ఇండికేటివ్ లిస్ట్ చుట్టూ అల్లారా..? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండికేటివ్ లిస్ట్ నే పెగాసస్ లిస్ట్ కింద మీడియా సంస్థలు ప్రచురించాయా..?

గురువారం నాడు భారత ప్రభుత్వ సలహాదారు కంచన్ గుప్తా దీని పై స్పందిస్తూ " పాజిబుల్ టార్గెట్స్" లిస్ట్ ను ఆమ్నెస్టీ బయటకి వదిల్తే దాని ఏదో ఒరిజినల్ లిస్ట్ అన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు పెద్దదిగా చేసి చూపెడుతూ దాని చుట్టూ కథలు అల్లాయని అన్నారు. 

టెక్నాలజీ న్యూస్ కి చెందిన కిమ్ జెట్టర్ పెట్టిన ట్విట్టర్ పోస్ట్ ని ఉటంకిస్తూ.."ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లిస్ట్ గురించిన వాస్తవాలను ఒప్పుకోవడం దాని వెనకున్న పెద్ద కుట్రను సూచిస్తుందని, ఇదొక కొత్త బిజినెస్ మోడల్ అని ఆయన అన్నారు. పెగాసస్ స్నూప్ గేట్ అనే కథ పూర్తిగా అవాస్తవమైనప్పటికీ... దాని వెనుకున్న దుర్మార్గపు ఆలోచనలను మాత్రం కొట్టిపారేయలేము" అని అన్నారు. 

ఇజ్రాయెలీ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ జెట్టర్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బయటకు వదిలిన లిస్ట్ ని ఎప్పుడూ కూడా ఎన్ఎస్ఓ సంస్థ పెగాసస్ స్పైవేర్ లిస్ట్ అని వదల్లేదని చెప్పినట్టు తెలిపాడు. 

తొలి నుంచి కూడా ఈ లిస్ట్ ఎన్ఎస్ఓ కస్టమర్స్ కి స్పై చేయడానికి పాజిబుల్ నంబర్స్ అని తాము చెప్పినట్టు పేర్కొన్నట్టు సదరు కథనంలో పేర్కొనబడిందని జెట్టర్ చెప్పాడు. జెట్టర్ ప్రకారంగా అలంటి వారిపైన స్పై చేయడానికి ఆస్కారముందని, కానీ వారిపైన్నే స్పై చేశారనడానికి ఆధారాలు లేవని అతను తెలిపాడు. 

మరో సైబర్ ఎక్స్పర్ట్ రుణ సాద్విక్ కూడా వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్లో... ఈ లిస్ట్ గురించిన 10 వేర్వేరు కథనాలను ప్రచురించి వాటిలో తేడా అర్థం చేసుకోండని చెప్పటం ట్వీట్ చేసింది. 

దానిపైన స్పందించిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ కూడా దీన్నొక కట్టు కథగా కొట్టిపారేశారు. ఆధారాలు లేకుండానే ప్రభుత్వం స్నూపింగ్ కి పాల్పడినట్టు కట్టుకథలల్లారని... 2013 లో ప్రిజం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్రేమిటో అందరికి తెలుసని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios