Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్‌పై సిట్ విచారణ: సుప్రీంకోర్టులో పిటిషన్

పెగాసెస్ వ్యవహరం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  జర్నలిస్టులు, రాజకీయనేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలైంది.

Pegasus snooping row: Plea filed in Supreme Court seeks court-monitored SIT probe lns
Author
New Delhi, First Published Jul 22, 2021, 2:38 PM IST

న్యూఢిల్లీ:పెగాసెస్ పై సుప్రీంకోర్టులో  గురువారం నాడు పిల్ దాఖలైంది.  కోర్టు పర్యవేక్షణలో  సిట్ ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.ఈ విషయమై  న్యాయవాది ఎంఎల్ శర్మ రిట్ పిటిషన్ ను దాఖలు చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి  జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయనాయకులు, ఇతరులపై మోసపూరితమైన ఆరోపణలున్నాయి.

2016 నుండి ఈ సంస్థ యొక్క ఖాతాదారులైన ఎన్ఎస్ఓ గ్రూప్ సుమారు 50 వేల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకొందని ఆ పిటిషనర్ ఆరోపించారు. ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించినట్టుగా పిల్ లో తెలిపారు.ప్రధాని, మంత్రులు స్వంత ప్రయోజనాల కోసం భారత పౌరులపై విరుచుకుపడటానికి  రాజ్యాంగం అనుమతించాలని అని పిటిషన్ ప్రశ్నించారు. అనుమతి లేకుండా పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేయడం భారత చట్టాలను ఉల్లంఘిస్తోందన్నారు.

విపక్ష నాయకులు, న్యాయవ్యవస్థ సభ్యులతో సహా భారత పౌరులపై నిఘా పెట్టడం నేరమని  పిల్ లో పిటిషనర్ ఆరోపించారు.పెగాసెస్ కేవలం నిఘా సాధనం మాత్రమే కాదు, ఇది భారతీయ రాజకీయాలపై విరుచుకుపడుతున్న సైబర్ ఆయధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సాఫ్ట్ వేర్ వాడకం జాతీయ భద్రతా ప్రమాదానికి గురి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios