శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ యువతి ఆస్పత్రిలో చేరగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచారు. కాగా.. ఆ ఐసీయూలోనే ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మీరట్ కి చెందిన ఓ యువతి అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరింది. కాగా..ఆమెకు నిద్రపోవడానికి ఇంజక్షన్ ద్వారా మత్తు మందు ఇచ్చి.. హాస్పటల్ సిబ్బందే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన సమయంలో.. ఐసీయూలోని సీసీ కెమేరాలను ఆఫ్ చేశారని పోలీసులుచెప్పారు.

బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన సిబ్బందిని ఆస్పత్రి నుంచి సస్పెండ్ చేశారు.