భారతదేశంలోని సిక్కుల చిరకాల వాంఛ కర్తార్‌పూర్ కారిడార్. దీని ద్వారా భారత్‌కు చెందిన యాత్రికులు నేరుగా పాకిస్తాన్‌లోని గురుద్వారా సాహిబ్‌ను దర్శించుకోవచ్చు. మరోవైపు భారత యాత్రికులు గురుద్వారాను దర్శించుకోవాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించలేదు.

ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాక్ ఇప్పటికే సిద్ధం చేసింది. దీని ప్రకారం.. ఒక్కో యాత్రికుడు 20 డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,400) చెల్లించాలని. అంతేకాకుండా ప్రతి 100 గ్రాముల ప్రసాదాన్ని రూ.151కి విక్రయించాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది.

పాక్‌ అక్కసు: కర్తార్‌పూర్ ప్రారంభానికి మోడీకి బదులు మన్మోహన్‌కు ఆహ్వానం

ప్రసాదం పూర్తిగా ఉచితమని.. దానిని ప్యాకింగ్ చేసినందుకే రూ.151 వసూలు చేస్తామని గురుద్వారా ప్రబంధక్ కమిటీ వెల్లడించింది. అయితే ఎంత న్యాయమైన ప్యాకింగ్ అయినా రూ.10కి మించదని పాకిస్తాన్ వసూలు చేస్తోన్న ధరలు అన్యాయంగా ఉన్నాయని భారత అధికారులు వాదిస్తున్నారు.

భారత సిక్కు యాత్రికుల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయొద్దని భారత్ పలుమార్లు పాకిస్తాన్‌ను కోరింది. అయినప్పటికీ మన వాదనను దాయాది దేశం పట్టించుకోలేదు. ఈ కారిడార్ ద్వారా రోజుకు సగటున 5 వేలమంది వరకు భారతీయులు గురుద్వారా దర్శనానికి వెళ్తారని అంచనా.

ఈ ప్రకారం ఒక్కొక్కరి నుంచి ప్రవేశ రుసుము కింద రూ.1400 వసూలు చేస్తే రోజుకు ఆ దేశానికి రూ.70 లక్షల ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే తీవ్రస్థాయిలో అప్పుల్లో కూరుకుపోయిన ఆ దేశానికి ఈ కారిడార్ ద్వారా నెలకు సుమారు రూ.20 కోట్లకు పైబడి ఆదాయం వస్తుందని అంచనా.

సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ దేవ్ తన జీవితంలో చివరి 18 ఏళ్లు కర్తార్‌పూర్‌లోనే గడిపి, ఇక్కడే తుదిశ్వాస విడిచారు. అందుకే ఈ గురుద్వారాకు సిక్కులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు.

మోదీని కాదని మాజీ ప్రధానికి పాక్ ఆహ్వానం: తిరస్కరించిన మన్మోహన్ సింగ్

దేశ విభజనతో ఈ ప్రాంతం పాకిస్తాన్‌ ఆధీనంలోకి వెళ్లడంతో భారత్‌లోని సిక్కులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్-పాకిస్తాన్‌లు కర్తార్‌పూర్‌ కారిడార్ ప్రాజెక్ట్‌ను సంయుక్తంగా చేపట్టాయి.

ఈ కారిడార్ ద్వారా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ మసీదుతో పాక్‌లోని కర్తార్‌పూర్‌ను అనుసంధానం చేస్తారు. రావి నదీతీరంలోని కర్తార్‌పూర్‌కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతిస్తుంది. 4.2 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం పంజాబ్‌లోని డేరా బాబానాయక్ నుంచి పాక్ కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను కలపనుంది.