న్యూఢిల్లీ: భారతదేశంపై దాయాది దేశం పాకిస్థాన్ యుద్ధానికి కత్తులు నూరుతోంది. దొడ్డిదారిలో భారత్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాతో చేతులు కలిపినట్లు పాక్ ఉగ్రవాదులు స్పష్టం చేశారు.  

కశ్మీర్ లో చొరబాటుకు ప్రయత్నించి పట్టుబడ్డ ఉగ్రవాదలు పాక్ కుట్రలను వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోచిబాకు చెందిన ఈ ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ విచారణలో ఆశ్చర్యపోయే విషయాలను వారు వెల్లడించారు. 

సుమారు 50 మంది ఉగ్రవాదులు భారత్‌లో చొరబడేందుంకు సిద్ధంగా ఉన్నారని భారత్ సైన్యం అదుపులో ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు స్పష్టం చేశారు. 50 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు పాక్ సైన్యం, ఐఎస్ఐ శిక్షణ ఇస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.  

శిక్షణ అనంతరం ఆ 50 మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోకి పంపించేందకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వారితోపాటు సుమారు 100 మంది ఎన్‌ఎస్‌జీ కమాండోలు శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

అయితే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాక్ ఇలాంటి విధ్వంసకర ప్లాన్ లకు ప్రయత్నిస్తుందని వారు తెలిపారు.