ఓ యువకుడి కాలేజీ బ్యాగులో కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ యువకుడి కాలేజీ బ్యాగులో కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం 6.30 సమయంలో మంగళూరులో బస్ దిగిన మంజునాద్ విద్యార్థులు వేసుకునే బ్యాగ్ వేసుకుని అనుమనాస్పదంగా వెళుతున్నాడు.
ఇతని తీరుపై పోలీసులకు అనుమానం రావడంతో మంగళూరు ఉత్తర పోలీసులు మంజునాథ్‌ను అడ్డుకుని అతడి వద్ద ఉన్న బ్యాగ్ ను పరిశీలించగా అందులో రూ.2000, రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. లెక్కించగా రూ. కోటిగా తేలింది.
వెంటనే అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించగా, నగదు ఎక్కడిది, ఎలా వచ్చిందనే వివరాలను చెప్పలేకపోయాడు. పోలీసులు అతని పేరు అడుగగా ఒక్కోసారి ఒక్కోటి చెబుతూ వచ్చాడు. చివరికి బెంగళూరుకి చెందిన మంజునాథ్ అని తెలిపాడు. ప్రస్తుతం అతని వద్ద లభించిన నగదుపై ఎలాంటి సమాచారం, ఆధారాలు అతడి వద్ద లబించలేదు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేసి ఆ దిశగా విచారణ తీవ్రతరం చేశారు.
