Asianet News TeluguAsianet News Telugu

రూ.500 కోసం.. జుట్టుజుట్టు పట్టుకొని కొట్టుకున్నారు..!

వీరు కొట్టుకునేందంతా.. వీడియోలో రికార్డు కావడంతో.. విషయం అధికారుల ముందుకు వచ్చింది. వారు విషయంపై ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

On Camera Two Health Workers Fight Over rs.500 in Bihar
Author
Hyderabad, First Published Jan 24, 2022, 1:22 PM IST

కేవలం రూ.500 కోసం.. ఇద్దరు మహిళా ఆరోగ్య కార్యకర్తలు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సంఘటన బిహార్  రాష్ట్రంలోని జమయి జిల్లాలో చోటుచేసుకోగా...  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ రాష్ట్రంలోని జమయి జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు మహిళలు... ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. కాగా.. వారిద్దరూ సడెన్ గా ఒకరినొకరు జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు. వీరు కొట్టుకునేందంతా.. వీడియోలో రికార్డు కావడంతో.. విషయం అధికారుల ముందుకు వచ్చింది. వారు విషయంపై ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఆశా వర్కర్ రింటూ కుమారి BCG వ్యాక్సిన్ షాట్ (శిశువులలో క్షయవ్యాధిని నివారించడానికి ఉపయోగించబడుతుంది) కోసం ఆక్సిలరీ నర్సు మిడ్‌వైఫ్ (ANM) రంజన కుమారి వద్దకు నవజాత శిశువును తీసుకెళ్లిన తర్వాత ఈ గొడవ జరిగింది.

అయితే, ANM కార్యకర్త వ్యాక్సిన్ షాట్ కోసం ₹ 500 డిమాండ్ చేశాడని ఒకరు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. దీంతో.. ఒకరినొకకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఓ వ్యక్తి వచ్చి.. వారి మధ్య తగాదా తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా.. వారు మాత్రం కొట్టుకోవడం ఆపకపోవడం గమనార్హం. చెప్పులు విసురుకొని కూడా కొట్టుకోవడం గమనార్హం. 

ఘటనపై సమాచారం అందుకున్న ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు  ఆ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలపై  ఎలాంటి చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios