దసరా నవరాత్రుల్లో కొందరు బార్ డ్యాన్సర్లు అసభ్య నృత్యాలు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లా రాంలీలాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... రాంపూర్ లోని మిలక్ ప్రాంతంలో నిర్వాహకులు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

అందులో సంప్రదాయ నృత్యాలకు బదులు బార్ డ్యాన్సర్లతో అసభ్యకర నృత్యాలు చేయిచారు. కాగా... దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెల్లవారుజాము వరకు సాగిన ఈ ప్రదర్శనలో యువతుల అసభ్య నృత్యాలకు యువకులు కేరింతలు పెట్టారు. 

త్వరగా డబ్బు సంపాదించేందుకు నిర్వాహకులు అసభ్య నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారని సమాచారం. కాగా ఈ నృత్యప్రదర్శనకు జిల్లా యంత్రాంగం నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని అధికారులు చెప్పారు. కాగా... నిర్వాహకులపై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.