COVID-19: జింకల్లో కరోనా కొత్త‌ వేరియంట్‌..! జంతువుల నుండి మానవులకు వైర‌స్‌!

COVID-19: జంతువుల నుండి మానవులకు COVID 19 వ్యాప్తి చెందుతుందా?  లేదా మాన‌వుల నుంచి జంతువుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందుతుందా? అనే  సందేహాలు తీవ్ర‌మ‌వున్నాయి. తాజా ప‌రిశోధ‌న‌లు కూడా వైర‌స్ వ్యాప్తి చెందే అవకాశం లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నాయి.
 

Omicron found in NYC deer raises questions about COVID transmission from animals to humans

COVID-19: కొత్త కొత్త రూపంలో కరోనా మ‌హమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా తగ్గిపోతుందనుకుంటున్న సమయంలో డెల్టా వేరియంట్ రూపంలో విరుచుక‌ప‌డింది.ఆ తర్వాత ఒమిక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచాన్ని కలవరపాటుకి గురి చేస్తోన్న విషయం తెలిసిందే.  ఇలా కరోనా వైరస్ కొత్త కొత్త వేరియంట్ల రూపంలో ప్ర‌పంచ మాన‌వాళిని క‌ల‌వ‌ర పెడుతున్నాయి. కోవిడ్ కొత్త కొత్త మ్యుటెంట్లు మనుషుల్ని ఊపిరి తీసుకోనివ్వడం లేదు. తాజాగా మ‌రో ప్ర‌శ్న ఉత్ప‌నమ‌వుతోంది. జంతువుల నుండి మానవులకు COVID 19 వ్యాప్తి చెందుతుందా?  లేదా మాన‌వుల నుంచి జంతువుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందుతుందా? అనే  సందేహాలు తీవ్ర‌మ‌వున్నాయి. తాజా ప‌రిశోధ‌న‌లు కూడా వైర‌స్ వ్యాప్తి చెందే అవకాశం లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

తాజాగా న్యూయార్క్ లోని వైల్డ్ వైట్-టెయిల్డ్ జింకలో వైరస్‌కి సంబంధించి కొత్తగా మూడు రకాల వేరియంట్లు కనుగొన్నారు. బరో ఆఫ్ స్టాటెన్ ఐలాండ్‌లోని 131 వైల్డ్ వైట్-టెయిల్డ్ జింకల‌ను ప‌రీక్షించ‌గా.. 
15% positive యాంటీబాడీస్  ఉన్న‌ట్టు గుర్తించారు. ఈ ఫలితాల ఆధారంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి 13.5 నుంచి 70 శాతం వరకు ఉందని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ (Pennsylvania State University) పరిశోధకులు చెబుతున్నారు.  అయితే.. జంతువుల నుండి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, జింక‌ల నుంచి కొత్త ఉత్ప‌రివ‌ర్త‌నాలను వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
 

పెన్ స్టేట్‌లోని వైరాలజీ ప్రొఫెసర్  డాక్టర్ సురేష్ కూచిపూడి మీడియాతో మాట్లాడుతూ..  ఓమిక్రాన్ వేరియంట్ అడవి జంతు జాతులలోకి కూడా  వ్యాప్తి చెందుతున్న‌దని తెలుసుకున్నామ‌నీ, జింకలో కోవిడ్ మ్యుటేషన్ కారణంగా కొత్త వేరియంట్‌ మానవులతో సహా ఇతర జాతులకు చేరుకుంటుందనీ. ఇలా 
 జరగడం చాలా ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. జింకలకు COVID-19 సోకినట్లు కనుగొనడం ఇది మొదటిసారి కాదు. 2020, సెప్టెంబరులో అయోవాలోని జింకలలో వైరస్‌కు ఉన్న‌ట్లు  పరిశోధకులు కనుగొన్నారు.

U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, హెల్త్ విభాగం ప్రకారం.. ఇల్లినాయిస్, మిచిగాన్, న్యూయార్క్, పెన్సిల్వేనియా మరియు ఒహియోతో సహా అనేక రాష్ట్రాల్లో COVID- 19సోకిన జింకలు కనుగొన్నారు. వీటిలో కొత్త ఫలితాలు వచ్చినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.

కెనడాలోని గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయంలోని అంటారియో వెటర్నరీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్. J. స్కాట్ వీస్ మీడియాతో మాట్లాడుతూ..  వివిధ అధ్యయనాల  ప్ర‌కారం..సహజంగానే  కొన్ని సార్లు జింక‌ల నుంచి మాన‌వుల‌కు వైర‌స్ వ్యాప్తిచెందుతోంద‌ని చెప్పారు.  

జింకలకు ఓమిక్రాన్ ఎలా సంక్రమించింది..
తాజా ప‌రిశోధ‌నలు విస్తుకొలిపే నిజాలు వెలువ‌డ్డాయి. జంతువుల్లో వైర‌స్ వ్యాప్తికి  ప్రారంభ బిందువు మాన‌వుడేనని తెలుస్తుంది. జింకలకు మానవులతో ప్రత్యక్ష సంబంధంలోకి ఈ వైర‌స్ వ్యాప్తి చెందినట్టు తెలుస్తుంది.  

యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ సర్వీసెస్‌లోని వైల్డ్‌లైఫ్ ఎకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సమంతా విస్లీ  మీడియాతో మాట్లాడుతూ.. మాన‌వుల కాలుషిత వల్ల‌.. వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ముంద‌ని, అదే సమయంలో, వ్యర్థ జలాల ద్వారా ఈ వైర‌స్ జింకలకు వ్యాప్తి చెంది ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్రస్తుత  డేటా ప్ర‌కారం. జింకలు ఇతర జింకలకు వైరస్‌ను వ్యాప్తి చేయగలవని సూచిస్తున్నాయి. కానీ అది మానవులకు తిరిగి వ్యాపించదని తెలుస్తుంది. 

కూచిపూడి మాట్లాడుతూ, మరిన్ని జంతువులకు వ్యాధి సోకకుండా నిరోధించడానికి కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వైర‌స్ సోకిన లేదా పాజిటివ్ పరీక్షించబడిన వారు పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం, వాటితో దూరంగా ఉండాల‌ని తెలిపారు. జంతువులకు వైరస్ వ్యాప్తి ప్ర‌ధానంగా మానవుల ద్వారానే జ‌రుగుతోంద‌ని, మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios