దేశంలో Omicron వేరియంట్ ఆధిపత్యం: కేంద్రం

దేశంలో ప్రస్తుతం Omicron వేరియంట్ ఆధిపత్యం కొనసాగుతోందని,  90 శాతానికి పైగా కోవిడ్ కేసులు తేలికపాటి నుండి మితమైన తీవ్రతతో హోమ్ ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నారు.. తక్కువ మందికే ఆక్సిజన్, ఐసీయూ పడకలు అవసరమవుతున్నాయని తెలిపింది.
 

Omicron Dominant Variant  Early Indication Of Plateau In Cases: Centre

భారతదేశంలో ప్ర‌స్తుతం కోవిడ్-19 కొత్త‌ వేరియంట్ Omicron ఆధిపత్యం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ప్ర‌స్తుతం న‌మోదవుతున్న కేసుల సంఖ్యలో అధిక శాతం కేసులు ఓమిక్రాన్ కేసులే ఉన్నాయ‌ని, దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాలలో 77 శాతం ఉన్నాయని, వైరస్ వ్యాప్తి తీవ్రతకు సంబంధించిన ముందస్తు సూచనలు కూడా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. 

డిసెంబరు మరియు జనవరిలోOmicron వేరియంట్ వ్యాప్తి వేగంగా పెరిగింది, అలాగే..BA.2 అని పిలువబడే Omicron సబ్‌వేరియంట్ ప్రాబల్యం కూడా పెరుగుతోందని కేంద్రం పేర్కొంది. పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయ‌డం వల్ల కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ‘‘థర్డ్ వేవ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి.. వైరస్ ఇన్‌ఫెక్షన్ తీవ్రత కూడా స్వల్పంగా ఉందని వెల్లడించింది.

మరణాల సంఖ్య తగ్గడానికి.. కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో వ్యాకినేష‌న్ ను వేగ‌వంతం చేశాయ‌ని, దీంతో యాక్టివ్ కేసు సంఖ్య, క‌రోనా మరణాలు మ‌ధ్య చాలా వ్య‌త్య‌సం న‌మోద‌వుతోంద‌ని, చాలా త‌క్కువ మొత్తం లో క‌రోనా మర‌ణాలు సంభ‌విస్తోన్నాయ‌ని, అంటువ్యాధుల తీవ్రత కూడా చాలా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ‌ సూచించింది.

 మొత్తం బాధితుల్లో 90 శాతం కంటే ఎక్కువ మందిలో స్వల్ప నుంచి మధ్యస్థ లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారనీ,  ఆక్సిజన్ మరియు ఐసియు బెడ్‌లు అవసరమయ్యే కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నాయని తెలిపింది. 
అలాగే.. దేశంలో తగినన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయని, ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ వేయడం వైరస్‌తో పోరాడడంలో అత్యంత ముఖ్యమైన దశ అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ అన్నారు. అనారోగ్య సమస్యలతో బాధ‌పడుతున్న రోగులు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించడం. త‌రుచు శానిటైజ్ చేసుకోవ‌డం, త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ ధరించ‌డం వంటి క‌రోనా నియ‌మ నిబంధ‌న‌లను పాటించాల‌ని బలరామ్ భార్గవ్ హెచ్చరించారు.

 నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఒడిశా, పశ్చిమ బెంగాల్,మహారాష్ట్రలో ఇప్పటికీ డెల్టా వేరియంట్ వైరస్ కేసులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఓమిక్రాన్ కేసులను మాత్రమే చూడటం లేదని అన్నారు. వ్యాక్సినేష‌న్ వేసుకున్న‌వారు కూడా కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లను అనుసరించాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉంద‌నీ, ప్ర‌స్తుతం టీకాలు వేయించుకోని వారు, అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌వ్యక్తులు  చనిపోతున్నారని అన్నారు. 
 
కేంద్ర నివేదిక ప్రకారం.. 11 రాష్ట్రాల్లో 50 వేల కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని, 14 రాష్ట్రాల్లో 10 వేల నుంచి 50 వేల మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం తెలిపింది. దేశంలో మొత్తం 551 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతానికిపైనే ఉందని, గతవారంతో పోల్చితే జిల్లాలు పెరిగాయని చెప్పింది. గతవారం ఈ సంఖ్య 527గా ఉంది.

ప్రభుత్వం క‌రోనా రోగులకు టెలిమెడిసిన్ అందిచ‌డం కోసం ఇ-సంజీవని ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించిందనీ, దీని ద్వారా ఇప్పటి వరకు 2.3 కోట్లకు పైగా  టెలికన్సల్టేషన్ అందిందని పేర్కొంది. వ్యాక్సిన్‌ల కోసం మార్కెట్ ఆమోదంపై, కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ ప్రతి ఆరు నెలలకోసారి డేటాను పంచుకోవాలని కోరినట్లు ప్రభుత్వం తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios