40 యేళ్ల వ్యవధిలో ఏడు రాష్ట్రాల్లో 14మందిని పెళ్లి చేసుకున్న నకిలీ డాక్టర్ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అతని భార్యల జాబితాలో మరో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.

భువనేశ్వర్ : ఒడిశాకు చెందిన 66 ఏళ్ల వ్యక్తి 40 యేళ్ల వ్యవధిలో Seven statesలో మధ్య వయస్కులు, విద్యావంతులైన 14 మంది మహిళలను Marriage చేసుకున్న సంగతి తెలిసిందే. అతన్ని సోమవారం పోలీసులు arrest చేశారు. కాగా ఈ కేసులో అతని భార్యల సంఖ్య మరో మూడుకు పెరిగిందని తాజాగా బుధవారం పోలీసు అధికారులు తెలిపారు. 

doctorననే Duplicate identityతో మహిళలను పరిచయం చేసుకుని.. వారితో ప్రేమాయణం నడిపి పెళ్లిళ్లు చేసుకున్నాడు. తాజాగా బయటపడ్డ భార్యల లిస్టులోఛత్తీస్‌గఢ్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్, అస్సాంకు చెందిన వైద్యురాలు, ఒడిశాకు చెందిన ఉన్నత విద్యావంతురాలైన మహిళ కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు.

భువనేశ్వర్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ యుఎస్ డాష్ భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ “నకిలీ వైద్యుడి ఖాతాలో మరో ముగ్గురు భార్యలను గుర్తించాం. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని చెప్పి నకిలీ వైద్యుడు రూ.18 లక్షలు మోసం చేశాడని ఆరోపించించింది’ అని చెప్పుకొచ్చారు.

"అతని మొబైల్ ఫోన్లు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. అతని ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుగుతుంది" అని డాష్ చెప్పారు. అంతేకాదు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) సహాయంతో నిందితుడి వద్ద మూడు పాన్ కార్డులు, 11 ఏటీఎం కార్డులు ఉన్నట్లు గుర్తించామని.. తెలిపింది.

అతని భార్యల్లో ఒడిశాలో నలుగురు, ఢిల్లీలో ముగ్గురు, అస్సాంలో ముగ్గురు, మధ్యప్రదేశ్, పంజాబ్‌లలో ఇద్దరు, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరందరినీ మోసపూరితంగా వివాహం చేసుకుని వారి వద్దనుంచి లక్షల రూపాయల్లో డబ్బులు దండుకుని పారిపోయాడని పోలీసులు తెలిపారు. 

డాక్టర్ బిభు ప్రకాష్ స్వైన్, డాక్టర్ రమణి రంజన్ స్వైన్ అనే మారుపేర్లతో చెలామణి అవుతున్న సెక్సాజెనేరియన్ రమేష్ చంద్ర స్వైన్ ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ఓ తీరప్రాంతా గ్రామానికి చెందినవాడు. అతను మహిళలను ఆకట్టుకోవడంలో దిట్ట.. తన వాక్చాతుర్యంతోనూ లెక్చరర్లను, కరుడుగట్టిన మహిళా పోలీసులను, లాజిక్స్ వెతినే న్యాయవాదులను కూడా ఆకర్షించాడు. అంతేకాదు తోడు కోసం వెంపర్లాడే ఎంతోమంది మధ్య వయస్కులైన మహిళలను ఆకర్షించి వాడుకున్నాడు.

చివరగా 2020లో పెళ్లి చేసుకున్న అతని చివరి, తాజా భార్య ఫిర్యాదుతో అతనికి అదృష్టం హ్యాండ్ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఆమె ఫిర్యాదు తో అతని 38 సంవత్సరాల తరువాత అతని లీలలు వెలుగులోకి వచ్చాయి. వాలంటైన్స్ డే రోజూ అతని చేతులకు బేడీలు పడ్డాయి. 

స్వైన్ మొదటిసారిగా 1982లో వివాహం చేసుకున్నాడు చివరిగా 2020లో వివాహం చేసుకున్నాడు. ఈ చివరి వివాహం కూడా ఢిల్లీకి చెందిన ఓ లెక్చరర్ లో ఢిల్లీలోని ఆర్యసమాజ్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ ఆరోపణలను నిందితుడు తోసిపుచ్చాడు. "నేను ఈ మహిళలందరినీ వివాహం చేసుకోలేదు. నేను నిజంగా డాక్టర్‌నే" అని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు స్వైన్ నొక్కిచెప్పాడు. స్వైన్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో మహిళలతో స్నేహం చేసే సమయంలో తన స్టేటస్‌ను దాచిపెట్టాడు.

మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానన్న హామీతో అతను పంజాబ్‌కు చెందిన భార్య దగ్గర రూ. 10 లక్షలు, ఆమెను వివాహం చేసుకున్న గురుద్వారా నుండి రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశారు. 2010లో హైదరాబాద్‌లో, 2006లో ఎర్నాకులంలో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగ యువకుల దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసి గతంలో రెండుసార్లు అరెస్టయ్యాడని పోలీసులు తెలిపారు.