Asianet News TeluguAsianet News Telugu

రాహుల్‌పై ఒబామా ప్రశంసలు: భారత్ గురించి ఏం తెలుసంటూ రౌత్ విమర్శలు

కంగనా రనౌత్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని సంజయ్ తప్పుపట్టారు

Obamas Remark On Rahul Gandhi Distasteful, Says Shiv Sena Sanjay Raut,
Author
Mumbai, First Published Nov 14, 2020, 8:09 PM IST

కంగనా రనౌత్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శివసేన ఫైర్ బ్రాండ్, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో వెలువరించిన అభిప్రాయాన్ని సంజయ్ తప్పుపట్టారు.

పని పూర్తి చేసి ఉపాధ్యాయుడి మెప్పును పొందాలని విద్యార్థి ఎలా ఆరాటపడతారో అలాంటిదే తప్పిస్తే ప్రావీణ్యం సంపాదించాలనే తపన రాహుల్ గాంధీలో లేదని ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’ పేరుతో రాసిన పుస్తకంలో ఒబామా అభిప్రాయడ్డారు.

దీనిపై రౌత్ స్పందిస్తూ.. ‘ఒక విదేశీ నేత భారత రాజకీయ నేతలపై అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేరని అభిప్రాయపడ్డారు. అది చాలా అసహ్యకరంగా ఉంటుందని సంజయ్ వ్యాఖ్యానించారు.  ట్రంప్ పిచ్చివాడు అని మేం అనలేమన్నారు. అసలు ఈ దేశం గురించి ఒబామాకు ఏమాత్రం తెలుసు?’ అంటూ రౌత్ విమర్శించారు.

కాగా, ఈ నెల 17న మార్కెట్లోకి విడుదల కానున్న ఈ పుస్తకంలో ఒబామా తన బాల్యం, రాజకీయ ప్రస్థానంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి కూడా ప్రస్తావించారు.

Follow Us:
Download App:
  • android
  • ios