పదేళ్ల క్రితం మెగా కుంభకోణాలు, ఇప్పుడు మెగా ప్రాజెక్టులు - అటల్ సేతు ప్రారంభం అనంతరం ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ (prime minster narendra modi) శుక్రవారం మహారాష్ట్ర (maharstra)లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ( Indias longest sea bridge Atal Setu)ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
పదేళ్ల క్రితం వరకు మెగా కుంభకోణాల గురించి మాట్లాడుకునేవారని, కానీ ఇప్పుడు మెగా ప్రాజెక్టులపై చర్చ జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవరాం సాయంత్రం ముంబైని నవీ ముంబైతో కలిపే భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ప్రధాని ప్రారంభించారు. దీంతో పాటు మహారాష్ట్రలోని పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ రోజు చాలా ముఖ్యమైనదని అన్నారు. ఇది ముంబై, మహారాష్ట్రలకు మాత్రమే కాదు, ఇది విక్షిత్ భారత్ తమ తీర్మానానికి ఒక అడుగు దగ్గరగా తీసుకువెళ్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని చెప్పారు. 2016 డిసెంబర్ 24న అటల్ సేతుకు పునాది వేసి భారత్ మారుతుందని, ఎదుగుతుందని తాను ప్రతిజ్ఞ చేశానని గుర్తు చేసుకున్నారు.
అటల్ సేతు ట్రాన్స్ హార్బర్ లింక్ భారతదేశ మౌలిక సదుపాయాల శక్తిని చూపిస్తుందని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి దారితీస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఏళ్ల తరబడి పనుల్లో జాప్యం చేసే అలవాటున్న వ్యవస్థపై ప్రజలకు ఆశలు లేదని తెలిపారు. బతికుండగా పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడం కష్టమని ప్రజలు భావించారని చెప్పారు. అందుకే తాను దేశం మారుతోందని హామీ ఇచ్చానని తెలిపారు. అప్పట్లో ఇది 'మోడీ గ్యారంటీ' అని, గత పదేళ్లలో దేశం తన కలలను సాకారం చేసుకుందని చెప్పారు.
Also Read: ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే అయోధ్యకు కాంగ్రెస్ గైర్హాజరు - బీజేపీ
ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా మొదట నాసిక్ వెళ్లి అక్కడ కాలారామ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయాన్ని శుభ్రపరిచారు. తరువాత అక్కడ యువతనుద్దేశించి ప్రసంగించారు. నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ లెక్ లడ్కీ యోజన లబ్ధిదారులకు ప్రధాని చెక్కులను అందజేశారు. రూ.12,700 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు.
ముంబైలోని ఖర్ రోడ్, గోరేగావ్ రైల్వే స్టేషన్ల మధ్య కొత్త 6 వ లైన్, థానే-వాషి, పన్వేల్ ట్రాన్స్-హార్బర్ లైన్ లో కొత్త సబర్బన్ రైల్వే స్టేషన్ దిఘా గావ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ముంబైలోని శాంతాక్రజ్ ఎలక్ట్రానిక్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లో జెమ్స్ అండ్ జువెలరీ సెక్టార్ ఫెసిలిటేషన్ సెంటర్ ను, మహారాష్ట్రలో మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు నమో మహిళా శశక్తికరణ్ అభియాన్ ప్రధాని ప్రారంభించారు.