ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వారికి రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలతో ఎన్ఐఏ తన మాజీ ఎస్పీని అరెస్టు చేసింది. ఇదే కేసులో గత ఏడాది నవంబర్ లో ఒకరిని అరెస్టు చేసింది.
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ఓవర్‌గ్రౌండ్ కార్మికులపై కేసులో నిందితుడికి రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తన మాజీ పోలీసు సూపరింటెండెంట్ (sp) అరవింద్ దిగ్విజయ్ నేగీని శుక్రవారం అరెస్టు చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు భారత దేశంలో తన ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించేందుకు, మద్దతు తెలిపి అమలు చేసేందుకు నెట్ వర్క్ వ్యాప్తి కోసం ఏర్పాటు చేసిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ల (OGWs) కు సమాచారం అందించారని ఆయన అభియోగం.
గత ఏడాది నవంబర్‌లో ఇదే కేసులో కాశ్మీర్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అనేక తీవ్రవాద సంబంధిత కేసులను విచారించిన నేగి ప్రస్తుతం NIA నుంచి వచ్చిన తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో నియమితుడయ్యారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లలో ఒకరికి నేగీ ఎన్‌ఐఏ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేశారని ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన ఆ రహస్య పత్రాలు ఎవరికి అందజేశారనే వివరాలను NIA వెల్లడించలేదు.
‘‘ విచారణ సమయంలో సిమ్లాలో (NIA నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి) AD నేగి IPS పాత్ర ధృవీకరించబడింది. అతని ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ కేసులో ఎల్‌ఇటికి చెందిన ఓజిడబ్ల్యుగా ఉన్న మరో నిందితుడికి ఎడి నేగి ఎన్‌ఐఎ అధికారిక రహస్య పత్రాలను లీక్ చేసినట్లు కూడా కనుగొనబడింది, ” అని దర్యాప్తు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
