Asianet News TeluguAsianet News Telugu

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ కు చెక్.. అత‌ని త‌ల‌పై 25 లక్షల రివార్డు..

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ.25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. అతని అనుచరులపై కూడా రివార్డులు ప్ర‌క‌టించింది. 

NIA announces 25 lakh reward on Dawood Ibrahim
Author
First Published Sep 1, 2022, 10:46 AM IST

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రూ. 25లక్షల నగదు రివార్డును ప్రకటించింది. దావూద్ ఇబ్రహీం, అతని గ్యాంగ్.. దేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్ర‌మ రవాణా, డ్రగ్స్, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌తో పాటు, పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుంది. దావూద్ ఇబ్రహీంను ఏవిధంగానైనా ప‌ట్టుకోవాల‌ని అత‌ని తలపై ఇండియన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఐఏ) రూ.25 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. దీనితో పాటు అత‌ని అనుచ‌రుల‌పై రివార్డులు ప్రకటించింది. 

ఇబ్రహీం ముఠా భారత్‌లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతోందని ఎన్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ముఠాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ స్మగ్లింగ్‌తో పాటు పాకిస్థాన్ ఏజెన్సీలు, దేశంలోని ఉగ్రవాద సంస్థల సహకారంతో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు. 

దావూద్ తో పాటు అత‌ని సోదరుడు అనీస్ ఇబ్రహీం అలియాస్ హాజీ అనీస్, జావేద్ పటేల్ అలియాస్ జావేద్ చిక్నా, షకీల్ షేక్ అలియాస్ ఛోటా షకీల్, ఇబ్రహీం ముస్తాక్ అబ్దుల్ రజాక్ మీనన్ అలియాస్ టైగర్ మీనన్‌లు కూడా  ఉగ్రవాద సంస్థల‌కు స‌హ‌క‌రించిన‌ట్టు ఏజెన్సీ ఆరోపించింది. ఈ క్ర‌మంలో ఛోటా షకీల్ పై రూ.20లక్షలు, అనీస్, చిక్నా, మెమన్ ల‌పై (ఒక్కొక్కరిపై) రూ. 15లక్షల చొప్పున నగదు రివార్డును ఎన్ఐఏ ప్ర‌క‌టించింది. 

దావూద్ అతని సహచరులు ‘డీ’ కంపెనీ – ఇబ్రహం గ్యాంగ్ భారత్‌దేశంలో స్మగ్లింగ్ చేయడానికి ఒక యూనిట్‌ను స్థాపించారని సంబంధించిన విచారణలో వెల్లడైందని, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నకిలీ భారత కరెన్సీ నోట్లు (ఎఫ్ఐసీఎన్) తరలింపుతోపాటు పాకిస్థాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థలతో సన్నిహితంగా ఉగ్రదాడులకు పాల్పడుతున్న‌ట్టు తెలింద‌ని ఎన్ఐఏ సీనియర్ అధికారి తెలిపారు.

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉండి, 1993 ముంబై వరుస పేలుళ్లతో సహా భారతదేశంలోని అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇబ్రహీం తలపై ఇప్పటికే 2003లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించిన $25 మిలియన్ల రివార్డు ప్ర‌క‌టించింది. అత‌డిని మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ జాబితాలో చేర్చింది. ఈ లిస్ట్‌లో దావూద్‌తో పాటు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, హిజ్బుల్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలావుద్దీన్, అతని సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్ ఉన్నారు.
 
ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్ చేసేందుకు 'డి' కంపెనీ ఉగ్రవాద గ్రూపులు, పాక్ గూఢచారి సంస్థ - ఐఎస్‌ఐ సహాయంతో భారత్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని సమాచారం అందుకున్న ఎన్‌ఐఎ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీం మరియు అతని సహాయకులపై తాజా కేసు నమోదు చేసింది. భారతీయ నగరాల్లో దాడులు చేసేందుకు LeT, JeM,  అల్-ఖైదా (AQ) టెర్రర్ ,  స్లీపర్ సెల్స్‌కు మద్దతు ఇస్తున్నారని నిర్థారించింది. విచారణలో భాగంగా ఈ ఏడాది మేలో .. హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సుహైల్ ఖండ్వానీతో సంబంధం ఉన్న 29 ప్రదేశాలతో సహా 29 ప్రదేశాలపై దాడి చేసింది ఎన్ఐఏ.

Follow Us:
Download App:
  • android
  • ios