కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ వ్యాఖ్యలు: సోషల్ మీడియాలో విమర్శలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించే పాదయాత్రపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: సమాజాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభం కావాలనేది కాంగ్రెస్ విధానమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.తొలుత బ్రేక్ ఇండియా యాత్ర ప్రారంభించారు. ఇప్పుడు భారత్ అన్యాయ యాత్ర ప్రారంభిస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.మోడీ భరోసా పేరుతో ఉన్న సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్ లో మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 జనవరి 14 నుండి రెండో విడత పాదయాత్రను ప్రారంభించనున్నారు. మణిపూర్ నుండి ముంబై వరకు యాత్ర చేయనున్నారు. 6,200 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. 2024 మార్చి 20న రాహుల్ గాంధీ యాత్రను ముగిస్తారు. గతంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే.