Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుభి

బీజేపీ కూటమి 211 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇకపోతే కాంగ్రెస్ కూటమి కేవలం 64 స్థానాలకే పరిమితం కానుందని ఎన్డీటీవీ సర్వేలో స్పష్టం చేసింది.  ఇతరులు 13చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. 
 

ndtv exit polls: bjp alliance parties single largest party in maharastra
Author
Maharashtra, First Published Oct 21, 2019, 7:13 PM IST

మహారాష్ట్ర: మహారాష్ట్రలో బీజేపీ తిరిగి అధికారంలో రాబోతుందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్ లో తేటతెల్లమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి రాబోతుందని తెలిపింది. 

బీజేపీ కూటమి 211 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపింది. ఇకపోతే కాంగ్రెస్ కూటమి కేవలం 64 స్థానాలకే పరిమితం కానుందని ఎన్డీటీవీ సర్వేలో స్పష్టం చేసింది.  ఇతరులు 13చోట్ల గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో తెలిపింది. 

బీజేపీ కూటమి    -211
కాంగ్రెస్ కూటమి -64
ఇతరులు           -13 

Read more #exitpolls: మహారాష్ట్రలో బీజేపీ హవా, వార్ వన్ సైడ్ ... ఏబీపీ సి ఓటర్ సర్వే...

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

Read more సీఎన్ఎన్- న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: మళ్లీ మహారాష్ట్ర బీజేపీదే...

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. 

జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. 

Read more India today exit polls: మహారాష్ట్రలో బీజేపీదే హవా...

వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios