కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పటియాలా సెంట్రల్ జైలులో యేడాది జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శిక్షా కాలంలో ఆయన క్లర్క్ గా పనిచేయనున్నారు.

చండీగఢ్ : మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది శిక్ష పడడంతో కాంగ్రెస్ నేత Navjot Singh Sidhu ప్రస్తుతం పటియాలా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షా కాలంలో ఆయన జైల్లోclerkగా పని చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. సాధారణంగా కఠిన Imprisonment పడిన ఖైదీలకు జైల్లో పనులు అప్పగిస్తారు. ఇందులో భాగంగానే సిద్దుకు Clerical work అప్పగించాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సిద్దు ప్రముఖ వ్యక్తి కావడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా ఇతర Prisonerల్లా జైలు గది నుంచి బయటకు వచ్చి చేసే పనులు అప్పగించలేదని అధికారులు తెలిపారు.

ఆయన తనకు కేటాయించిన సెల్లోనే క్లర్కుగా పని చేయనున్నట్లు చెప్పారు. ఆ గదికే ఫైళ్లను పంపనున్నట్లు తెలిపారు. సిద్దు రోజుకు రెండు షిఫ్టుల్లో.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు పనిచేయనున్నారు. తొలి మూడు నెలల పాటు ట్రైనీగా పరిగణించి ఈ పనిలో శిక్షణ ఇవ్వనున్నారు. సుదీర్ఘమైన కోర్టు తీర్పులను బ్రీఫింగ్ చేయడం, జైలు రికార్డులను రాయడం వంటి వాటిని నేర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగానూ.. తొలి మూడు నెలల పాటు సిద్ధూకు ఎలాంటి వేతనం ఇవ్వబోరు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయన నైపుణ్యాలను బట్టి రోజుకు రూ. 40 నుంచి 90 వరకు వేతనం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ మొత్తాన్ని ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సిద్దు క్లర్కుగా శిక్షణ తీసుకోవడం మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. 34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో సిద్దూకి ఇటీవల సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 డిసెంబర్ 27న…సిద్దు, ఆయన స్నేహితుడైన రూపేందర్ సింగ్ సంధు పటియాలాలో రోడ్డు మధ్యలో జిప్సీ ఆపి ఉంచారు. ఆ మార్గంలో వచ్చిన గుర్నాంసింగ్ (65) వాహనాన్ని పక్కకు తియ్యమని పదేపదే కోరారు. 

ఆవేశంతో మిత్రులు ఇద్దరు వృద్ధుడిని కారు నుంచి బయటకు లాగి చితకబాదారు అనేది ఈ కేసులో అభియోగం. గాయపడిన గుర్నాంసింగ్ ను ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తొలుత పటియాల జిల్లా సెషన్స్ కోర్టు, ఆపై పంజాబ్, హర్యానా హైకోర్టు… ఆ తర్వాత సుప్రీంకోర్టుకు చేరిన ఈ కేసులో సిద్దూకి శిక్ష పడింది. ఈ కేసులో సిద్దు లొంగిపోవడంతో ఆయనను పటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. 

ఇదిలా ఉండగా, 1988 నాటి రోడ్ రేజ్ కేసులో సిద్ధూకి సుప్రీంకోర్టు మే 19న ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఒక టేబుల్, ఒక కుర్చీ, రెండు తలపాగాలు, ఒక అల్మారా, ఒక దుప్పటి, మూడు సెట్ల లోదుస్తులు, రెండు టవల్స్, ఒక దోమ తెర, ఒక పెన్, ఒక నోట్‌బుక్, ఒక జత బూట్లు, రెండు బెడ్ షీట్లు, నాలుగు జతల కుర్తా పైజామాలు, రెండు దిండు కవర్లు పాటియాలా సెంట్రల్ జైలులో ఇచ్చారు.

అతని ఖైదీ నంబర్ 241383. నవజ్యోత్ సింగ్ సిద్ధూకు బ్యారక్ నంబర్ 7గా కేటాయించబడిందని వర్గాలు తెలిపాయి. గతంలో 2018 మార్చిలో రూ. 1,000 జరిమానాతో సిద్ధూను విడిచిపెట్టారు. ఇప్పుడు, IPC సెక్షన్ 323 ప్రకారం గరిష్టంగా పడాల్సిన శిక్ష సిద్ధూకి విధించబడింది.